జీన్స్, దొంగ దొంగ, జోడీ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన హీరో ప్రశాంత్. నిర్మాత త్యాగరాజన్ కొడుకుగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో అటు కోలీవుడ్ లోను, ఇటు తెలుగులోని తనదైన నటనతో అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ప్రశాంత్, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ హీరో అంధాధూన్ రీమేక్ లో నటిస్తున్నాడు.
ఇకపోతే ఈ హీరో గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ప్రశాంత్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆ వార్త సారాంశం. ఈ హీరోకు 2005 లో గృహలక్ష్మి అనే బిజినెస్ మ్యాన్ కూతురితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇక మూడేళ్ళ తరువాత వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2008 లో విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం ప్రశాంత్ ఒంటారిగా ఉంటున్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ప్రశాంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట.. వారి కుటుంబానికి పరిచయం ఉన్న ఒక అమ్మాయిని అతడు వివాహమాడనున్నాడట. తన సినిమా అంధాధూన్ రిలీజ్ అయ్యాక ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనున్నాడట. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే ప్రశాంత్ నోరు విప్పాల్సిందే.