Shivani Rajashekar: యాంగ్రి యంగ్ మాన్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివానీ రాజశేఖర్ అద్భుతం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత `డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ` మూవీలో నటించింది. ఆ తర్వాత వరుసగా మూడు సినిమాలను తమిళంలో చేశారు. రీసెంట్ గా అహ నా పెళ్లంట అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రమోషన్స్ లో శివాని రాజశేఖర్ పాల్గొన్నారు. తనపై వచ్చిన తాజా రూమర్ గురించి మాట్లాడుతూ అది చాలా చిన్న విషయమని కొట్టి పారేశారు.
Read Also: బాలీవుడ్‌ను తమ అందాలతో వేడెక్కిస్తున్న విదేశీ భామలు..
శివాని రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. “అప్పుడే అంతా నా పెళ్లి గురించి అడుగుతున్నారు. కానీ నా కెరియర్ పై మాత్రమే నేను దృష్టి పెట్టాను” అంది. “మా ఇంట్లో మా అమ్మానాన్నలు కూడా నా పెళ్లి గురించిన ప్రయత్నాలు ఇంకా మొదలుపెట్టలేదు. ఎవరి పనులతో వాళ్లం బిజీగా ఉన్నాము. అందువల్ల పెళ్లి గురించి ఆలోచించే సమయం నాకు లేదు. ఇప్పట్లో నా పెళ్లికి వచ్చిన కంగారేం లేదు. ముందు కెరీయర్ లో స్థిరపడాలి అనే ఆలోచనలోనే ఉన్నాను” అని చెప్పింది. అంతేకాకుండా ఆమె “మా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడూ కూడా ఏవో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా నేను ఎవరినో ప్రేమించి ఇంట్లోంచి వెళ్లిపోయినట్టుగా కూడా ఒక రూమర్ వచ్చింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలలో కొందరు చనిపోయినట్టుగా వీడియోస్ కూడా పెడుతున్నారు. వాటితో పోల్చుకుంటే నా విషయంలో వచ్చిన రూమర్ చాలా చిన్నదే. అయినా దాని తర్వాతనే నేను మరింత స్ట్రాంగ్ అయ్యాను లెండి” అంటూ చెప్పుకొచ్చింది శివాని.