దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రైడెంట్ హోటల్ బిల్డింగ్ నుంచి భారీగా పొగలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భవనంపై భాగం నుంచి దట్టమైన పొగలు బయటకు రావడం చూసిన స్ధానికులు భయాందోళనకు గురయ్యారు. ముంబైలోని నారిమన్ పాయింట్‌లో ట్రైడెంట్ హోటల్ ఉంది. అయితే ఈ హోటల్ పైభాగంలో ఉదయం 7 గంటలకు దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడున్న జనం ఆందోళనతో బయటకు పరిగెత్తుకుంటూ వచ్చారు.
Also Read: Bihar: భూమ్మీద నూకలుండడం అంతే ఇదేనేమో.. రైలు కిందపడ్డా చిన్న గీతకూడా పడలేదు
ట్రైడెంట్ హోటల్ నుంచి పొగలు రావడంతో ఈ దృశ్యాలను స్థానికులు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ట్రైడెంట్ హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగిందంటూ వచ్చిన వార్తలును ముంబై పోలీసులు ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటనను వారు విడుదల చేశారు. హోటల్ బాయిలర్ రూం నుంచి పొగలు వస్తున్నాయని తెలిపారు. దీని వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. దీంతో హోటల్ లోని కస్టమర్లు, పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Electric Vehicles: ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా.. వీటి గురించి తెలుసుకోండి..
ఈ ఇష్యూపై హోటల్ యాజమాన్యం స్పందించింది. తమ హోటల్‌లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరగలేదని వారు తెలిపారు. హోటల్‌లో చిమ్నీని శుభ్రం చేసే పని జరుగుతుండడంతో నల్లటి పొగ కమ్ముకుందని హోటల్ యాజమాన్యం తెలిపింది. అయితే అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ.. తమకు వచ్చిన సమాచారం ప్రకారం ట్రైడెంట్ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగింది కానీ అది వారి సిబ్బందే ఆ మంటలను ఆర్పివేసినట్లు ఆయన వెల్లడించారు.