తీవ్ర తల గాయాలు ప్రమాదాలను తగ్గించేందుకు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అరేటే హాస్పిటల్స్ ఓ మంచి కార్యక్రమం చేపట్టింది. 'వరల్డ్ హెడ్ ఇంజ్యూరీ డే' అవగాహన దినోత్సవం సందర్భంగా "తల కోసం ముందుచూపు – హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దక్కుతాయి" అనే సమాజహితం కార్యక్రమాన్ని నిర్వహించింది.
హైదరాబాద్ నగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో యువ ఇంజనీర్ నవీన్ చారీ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఆసక్తితో, ఆశలతో తన మొదటి ఉద్యోగం ప్రారంభించిన నవీన్ చారీ ఆ రోజు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. కోకాపేట్ టీ-గ్రీల్ వద్ద నవీన్ చారీ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతడిని వేగంగా ఢీకొట్టింది.…
School Kids Car Driving: ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అయితే, కంటెంట్ అనుసరించి కొన్ని వైరల్ అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇదివరకు సోషల్ మీడియాలో అనేక మార్లు ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అయ్యాయి. రోడ్లపై ఇష్టానుసారం వెళ్లడం, రోడ్డుపై వెళ్తున్న సమయంలో ప్రేమికులు రెచ్చిపతూ వెళ్లడం లాంటి ఘటనలు సంబంధించిన అనేక వీడియోలు మనం చూసాం. ఇకపోతే, తాజాగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు సంబంధించిన…
స్విఫ్ట్ కారు ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎంజీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఎంజీఐటీ కాలేజ్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న.. 6గురూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈరోజు డుమ్మా కొట్టారని తెలిపారు. "ఒక్కసారి స్టూడెంట్స్ కాలేజ్ లోనికి వచ్చారంటే బయట వెళ్ళడానికి వీలులేదు. నార్సింగి మూవీ టవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని మధ్యహ్నం 3:30 గంటలకు సమాచారం అందింది.
యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బైక్‌లు, కార్లలో వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు, వాహనాలు వేగంగా ఉండడంతో వాటిని కంట్రోల్ చేయలేక ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా నార్సింగి పరిధిలో ఓ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో మరో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు బలయ్యారు.
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓ టూ వీలర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టూ వీలర్ పై వెళ్తున్న ఒకరు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Car Racing: హైదరాబాద్ నగరంలో మరోసారి కార్ రేసర్లు రెచ్చిపోయారు. శంషాబాద్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున కొంతమంది యువకులు కార్లతో రేసింగ్‌లు, స్టంట్‌లు చేయడం ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ యువకులు ఓఆర్‌ఆర్‌పై వేగంగా కార్లు నడిపించి, ఆపై ఒక్కసారిగా వాటిని ఆపి గింగిరాలు తిప్పారు. ఇలా ఉన్నచోటే కార్లను పలుమార్లు రౌండ్‌గా తిప్పుతూ హంగామా సృష్టించారు. ఈ కార్ రేసింగ్ కారణంగా ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులకు…
Accident : పెద్దఅంబర్ పేట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రిత్విక అనే నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. హయత్‌నగర్ శ్రీచైతన్య టెక్నో స్కూల్ లో రిత్విక LKG చదువుతోంది. అయితే.. రోజులాగే ఈ రోజు కూడా బాలిక బస్సు దిగింది. అయితే.. బాలిక దిగి వెళ్తుండగా ఒక్కసారిగా బస్సు రివర్స్ చేయడం ప్రమాదం చోటు చేసుకుంది. కుమార్తె మరణ వార్తతో బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి…
Road Accident: ఓవర్ స్పీడింగ్ కారణంగా హైదరాబాద్ లోని బహుదూర్ పుర్ నుంచి ఆరంఘర్ వెళ్లే కొత్త ప్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. బహదూర్ పూరాకు చెందిన మైనర్లు మాస్ ఖాద్రీ, మహ్మద్ అహ్మద్, మరో బాలుడు బైక్‌పై ఆరంఘర్ వైపు వెళ్తుండగా శివరాంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. బైక్ అధిక వేగంతో ముందుకు దూసుకుపోవడంతో అదుపు తప్పి ముందుగా ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీ…
CM Revanth Reddy : హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త.. గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా కొత్త ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం 42 పనులలో 36 పనులు పూర్తి అయ్యాయి. ఇందులో అత్యంత ప్రాముఖ్యమైన ఫ్లైఓవర్, జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించబడింది. ఇది సికింద్రాబాద్, వరంగల్, భువనగిరి, మేడ్చల్, హుజురాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల వాసులకు శంషాబాద్ విమానాశ్రయానికి సిగ్నల్-ఫ్రీ ట్రావెల్‌ను సౌకర్యవంతంగా అందిస్తుంది. PM Modi: 8న…