మద్యం సేవించి వాహనం నడపడం చాలా ప్రమాదకరమైన చర్య. మద్యం మనం కళ్లతో చూస్తున్నదానిపై కూడా ప్రభావం చూపుతుంది, మన మస్తిష్కాన్ని, నాడీ వ్యవస్థను క్రమంగా ప్రభావితం చేస్తుంది. ఇది మన అవగాహనను తగ్గించి, మనం తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది.
Hyderabad New Traffic Rules :హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నుంచి భారీ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించనున్నారు. హెల్మెట్ లేకుండా, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయడం వల్ల గత మూడు రోజుల్లో నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళతో సహా ముగ్గురు మరణించారని అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) పి విశ్వ ప్రసాద్ తెలిపారు. అలాగే, ఈ మూడు కేసుల్లోనూ బాధితులు రక్షణ…
మద్యపానం మన సమాజంలో ఒక సాంఘిక సమస్యగా మారింది, దీని ప్రభావం చాలా తీవ్రమైంది. మద్యం మత్తులో వాహనాలను నడిపించడం అనేది అనేక ప్రమాదాలను పుట్టించటమే కాకుండా, అనేక ప్రాణాలను కూడా బలిగొంటున్నది. ఈ అలవాటు వల్ల ప్రతి సంవత్సరం వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
HYDRA Volunteers : ట్రాఫిక్ పోలీసులకు హైడ్రా వాలంటీర్ల సహకారం అందివ్వనున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించేందుకు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మొదటి విడతగా 50 మందికి శిక్షణ ఇస్తున్నారు ట్రాఫిక్ అధికారులు. ఈక్రమంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ మెలుకువలు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నేర్చుకుంటున్నారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్‌లు పేరిట ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలు అందించనున్నారు హైడ్రా వాలంటీర్లు. ట్రాఫిక్ రద్దీ, ఇతర…
Helmets: తన కూతురి పెళ్లికి వచ్చిన అతిథులకు వినూత్నమైన గిఫ్ట్స్ అందించాడు ఆ తండ్రి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వివాహానికి వచ్చిన వారికి ఉచితంగా హెల్మెట్లను గిఫ్టులుగా ఇచ్చాడు. ఛత్తీస్‌గఢ్ కోర్బా నగరంలోని ముదాపర్ ప్రాంతానికి చెందిన సెద్ యాదవ్ అనే వ్యక్తి సోమవారం జరిగిన తన కుమార్తె పెళ్లిలో ఇలాంటి బహుమతులు ఇవ్వడం వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యులు కూడా హెల్మెట్ ధరించి డ్యాన్స్ చేశారు.
యునైటెడ్ స్టేట్స్‌లో ఓ యువకుడు చేసిన వీడియో అందరి మతిపోగుడుతుంది. హార్ట్ ఎటాక్ ఉన్నవారు ఈ వీడియో చూడకపోవడం అత్యంత మంచింది. ఆ వీడియోలో ఓ యువకుడు చేసిన స్టంట్ మ్యత్యువును ధిక్కరించే విధంగా ఉంది. రోడ్డుపై స్పీడ్ గా వస్తున్న ఓ ట్రక్కుకు ఎదురెళ్లి బొక్క బోర్ల పడుకుంటాడు.. అతను ట్రక్కు మధ్య భాగంలో ఉండే స్థలంలో పడుకునేసరికి అది వెళ్లిపోతుంది.
పుష్ప.. పుష్ప రాజ్ మ్యానియా మొదలయ్యింది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలై హిట్ టాక్ ని అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. ఎక్కడ విన్నా.. ఎక్కడా చూసినా పుష్పనే కనిపిస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ పోలీసులు సైతం పుష్ప పేరే కలవరిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్తకొత్త పద్దతులతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమదైన రీతిలో పుష్ప పోస్టర్ ని వాడుకున్నారు.. పుష్ప పోస్టర్ లో బైక్ పై నిలబడిన…