Arrive Alive : తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ రాష్ట్రంలో రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యంతో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) పేరుతో ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విధితమే. ఈ కార్యక్రమంద్వారా, ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన కీలక సూచనలను పోలీస్ శాఖ పత్రిక ప్రకటన ద్వారా విడుదల చేసింది. చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు, ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు,…
బైక్ ప్రయాణించే వారికి హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యం. ప్రమాద సమయాల్లో ప్రాణాపాయాన్ని తప్పిస్తుంది. హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు పదే పదే వాహనదారులకు సూచిస్తుంటారు. అయితే ఇప్పుడు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలు హెల్మెట్ ధరించడం తప్పనిసరి కానుంది. ఇటీవల, కర్ణాటక హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించి, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లలకు పిల్లల సైజు హెల్మెట్‌లు, సేఫ్టీ హార్నెస్‌లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని హైకోర్టు పేర్కొంది.…
Babu Mohan : ప్రముఖ నటుడు బాబు మోహన్ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. నటుడుగా ఎంతో పేరు సంపాదించుకున్న ఆయన.. పొలిటికల్ గా ఆ స్థాయిలో రాణించలేకపోయారు. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడు. తజాఆగా చిల్డ్రన్స్ డేలో భాగంగా ఓ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. చిన్నప్పుడే నాకు పోలీస్ అవ్వాలి అనే పెద్ద కోరిక ఉండేది. జంబలకడిపంబ సినిమాలో పోలీస్ పాత్ర దక్కడంతో…
హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో ‘అరైవ్ & అలైవ్’ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ట్రాఫిక్ అదనపు సీపీ జోయిస్ డేవిస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు, యువత, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.
Chevella Bus Accident : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుమోటోగా కేసు నమోదు చేసింది. డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, కమిషన్ గౌరవ ఛైర్పర్సన్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేయబడింది. ఈ ఘటనలో రోడ్డు భద్రతా లోపాలు, అధిక వేగం, హైవే విస్తరణ ఆలస్యం, అలాగే అధికారుల…
హైదరాబాద్ నగరంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ప్రమాదకర అలవాటు వల్ల రహదారులపై రద్దీతో పాటు ప్రాణాపాయ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఈ సమస్యను అరికట్టేందుకు ఇటీవల ట్రాఫిక్ శాఖ భారీ స్థాయిలో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వివరాల ప్రకారం అక్టోబర్ మొదటి వారంలోనే వారంరోజుల ప్రత్యేక డ్రైవ్‌లో 10,652 మంది మోటారిస్టులపై రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశారు. నగరంలోని మల్టీలేన్…
Viral Video: కర్నూలు బస్సు ప్రమాదం యావత్ తెలుగు రాష్ట్రాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నటేకూరు వద్ద బస్సు బైకును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు బస్లో ఉన్న ప్రయాణికుల్లో 19 మంది మరణించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.
Hit And Run Case: హైదరాబాద్ మహా నగరంలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ చౌరస్తా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే, హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది.
RTA Raids: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. జిల్లాల్లోని పలు కీలక ప్రాంతాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై ఆర్టీఏ అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.