Sleeper Bus Safety: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో వీ.కావేరి ట్రావెల్స్‌కి చెందిన వోల్వో బస్సులో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున కల్లూరు మండలం చిన్నటకూరు సమీపంలో కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో చిక్కుకుంది. మొదట బైక్‌ను ఢీకొన్న బస్సు.. ముందు భాగంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం వ్యాపించింది. కొద్దిసేపటికే బస్సు మొత్తం బూడిదైంది. ఈ విషాద సంఘటనలో ఇప్పటివరకు 19 మంది మరణించినట్లు సమాచారం. పలువురి ప్రయాణికులకు తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నారు.
Ponnam Prabhakar : ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో చెక్ పోస్టులను రద్దు చేస్తూ జీవో జారీ చేసినట్లు ప్రకటించారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఆన్లైన్‌లో జరగాలనే ఉద్దేశంతో రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకుని, ఈరోజు నుండి చెక్ పోస్టులు పూర్తిగా మూసివేస్తూ అమలు చేస్తున్నామని తెలిపారు. రవాణా వ్యవస్థలో ఆధునికత, పారదర్శకతను తీసుకురావడమే…
No Call Is More Important Than a Life: హైదరాబాద్లో డ్రైవింగ్ లేదా రైడింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. డ్రైవర్ దృష్టి, సమయానికి స్పందించకపోవడం ఆలస్యంవల్ల రోడ్డు ప్రమాదాల ప్రధాన కారణంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదకర ప్రవర్తనను నియంత్రించేందుకు నగరంలో ప్రత్యేక డ్రైవ్‌లు ప్రారంభించబడ్డాయని అధికారులు సోషల్ మీడియాలో తెలిపారు. Minister Lokesh: గత ఐదేళ్లలో విధ్వంసం..…
Safe Ride Challenge: పౌరుల్లో బాధ్యతాయుత డ్రైవింగ్ అలవాట్లను ప్రోత్సహించే లక్ష్యంతో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనర్ తాజాగా #SafeRideChallenge అనే సోషల్ మీడియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం రోడ్డు భద్రతను వైరల్ ట్రెండ్‌గా మార్చడమే ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ క్యాంపెయిన్‌లో భాగంగా.. వాహనదారులు ప్రయాణం ప్రారంభించే ముందు హెల్మెట్ ధరించడం లేదా సీట్‌బెల్ట్ కట్టుకోవడం వంటి భద్రతా చర్యలను చూపిస్తూ ఒక చిన్న వీడియో లేదా ఫోటో తీసి, ముగ్గురు స్నేహితులను…
Prayagraj Stray Dog Crisis: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ నగరంలో వీధికుక్కల సంఖ్య 1 లక్ష 15 వేలు దాటింది. ప్రతి నెలా నాలుగు వేలకు పైగా కుక్క కాటు సంఘటనలు జరుగుతున్నాయి. వీధికుక్కల కారణంగా ప్రతి నెలా వందలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత వారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బ్యాంకు మేనేజర్‌ను ఒక వీధికుక్క వెంబడించింది. తప్పించుకుని పారిపోతుండగా.. మున్సిపల్ చెత్త ట్రక్కు కింద పడి మృతి చెందాడు. ఈ ఘటన ఒక్కసారిగా నగరంలో…
తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్ట్రేషన్ పొందిన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) తప్పనిసరిగా అమర్చుకోవాలని స్పష్టం చేసింది.
Tesla Fined: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ సంస్థ టెస్లాకు భారీ జరిమానా పడింది. 2019లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కేసులో టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థ లోపమే ప్రమాదానికి కారణమని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది.
Truck: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్‌గఢ్ జిల్లాలోని ఖోపోలి సమీపంలో అదుపు తప్పిన ట్రక్కు 20 వాహనాలను ఢీకొట్టింది. కంటైనర్ ట్రక్కు ఘాట్ సెక్షన్లో వాలు నుంచి దిగుతుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ సంఘటన జరిగింది. నియంత్రణ కోల్పోయిన ట్రక్కు ముందున్న పదుల సంఖ్యలో వాహనాలనపు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొనడంతో పలు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే చాలా మంది గాయపడ్డారు. Read Also: Srushti IVF…
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గులాబో దేవి కాన్వాయ్ మంగళవారం ప్రమాదానికి గురైంది. ఆమె కాన్వాయ్ ఢిల్లీ నుంచి బిజ్నోర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పిల్ఖువా కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారి-9పై కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గులాబో దేవి ప్రయాణిస్తున్న కారు కూడా ఢీకొట్టింది. గాయాలపాలైన ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.