No Call Is More Important Than a Life: హైదరాబాద్‌లో డ్రైవింగ్ లేదా రైడింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. డ్రైవర్ దృష్టి, సమయానికి స్పందించకపోవడం ఆలస్యంవల్ల రోడ్డు ప్రమాదాల ప్రధాన కారణంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదకర ప్రవర్తనను నియంత్రించేందుకు నగరంలో ప్రత్యేక డ్రైవ్‌లు ప్రారంభించబడ్డాయని అధికారులు సోషల్ మీడియాలో తెలిపారు.
Minister Lokesh: గత ఐదేళ్లలో విధ్వంసం.. విశాఖ రూపురేఖలు మార్చనున్న గూగుల్..
ఇకపోతే 2025 జనవరి 1 నుండి అక్టోబర్ 12 వరకు 80,555 కేసులు నమోదు కాగా, అక్టోబర్ 13–14 తేదీల్లో మాత్రమే ఏకంగా 2,345 కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రైవింగ్ లేదా రైడింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకం ఉండకూడదని హెచ్చరించారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు, కోర్టు జరిమానాలు విధించబడతాయని తెలిపారు. రోడ్డు భద్రత కోసం ప్రతి ఒక్కరు పోలీస్ సూచనలను పాటించి, ఉల్లంఘనలను చేయకుండా సహకరించాలని కోరారు.
Ravi Naik: గోవా మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ కన్నుమూత.. మోడీ సంతాపం
ఒకవేళ ఏదైనా నివేదికలు ఉంటే వాటిని ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నెంబర్ 9010203626 కు, అలాగే e-చలాన్ హెల్ప్‌డెస్క్ నెంబర్ 8712661690కు, అధికారిక సోషల్ మీడియా ద్వారా తెలపవచ్చని పేర్కొన్నారు. చివరగా.. “ఒక లైఫ్ కన్నా కాల్ ముఖ్యమే కాదు” (No Call Is More Important Than a Life) అనే హెచ్చరికతో ప్రతి డ్రైవర్ సురక్షితంగా రోడ్లపై ముందుకు సాగాలని సూచించారు.
𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 𝗧𝗿𝗮𝗳𝗳𝗶𝗰 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗪𝗮𝗿𝗻𝘀 𝗼𝗻 𝗠𝗼𝗯𝗶𝗹𝗲 𝗣𝗵𝗼𝗻𝗲 𝗨𝘀𝗲 𝗪𝗵𝗶𝗹𝗲 𝗗𝗿𝗶𝘃𝗶𝗻𝗴
The Hyderabad Traffic Police has noticed a high number of motorists using mobile phones while driving or riding, a major cause of road accidents due to driver…
— Hyderabad City Police (@hydcitypolice) October 14, 2025