ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లీడర్ ఆర్కే రోజా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో హవా నడిపిన మాజీ మంత్రి... ఓటమి తర్వాత చాలా రోజులు పొలిటికల్ అజ్ఞాతంలో గడిపారు. అప్పట్లో అందరికంటే ఎక్కువగా పవర్‌ని, పదవిని ఎంజాయ్ చేశారన్న పేరు వచ్చింది ఆమెకు. అలాగే నాటి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు ఆమె స్థాయిని దిగజార్చాయన్న అభిప్రాయం ఉంది.
తిరుమల చరిత్రలో ఎప్పుడూ జరగని ఘోరం చూశామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చంద్రబాబు అసమర్థత ఈ ఘటనతో స్పష్టమైందని విమర్శిచారు.. ఘటనకు కారణమెవరో కనుక్కోకుండా నీతి మాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.. అధికారులను, టీటీడీ బోర్డును ఎవరు పెట్టారని ప్రశ్నించారు.. భక్తులకు సర్వీస్ చేయాలన్న ఉద్దేశ్యం ఎవరికి లేదన్నారు.. అధికారులు చంద్రబాబు దగ్గర భజన చేస్తూ తిరుగుతూ భక్తులను గాలికి వదిలేశారని విమర్శించారు.. గత ఏడాది వైసీపీ హయాంలో ఎలా చేశామో అందరూ చూశారన్నారు.…
RK Roja: నగరిలో జరిగిన దళితుల దాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు ఆమె. దళితులను ఊర్లో రానివ్వమని, తిరగకూడదని, ఊరి నుండి వెలివేయాలని హుకుం జారీ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు దళితులపై భౌతిక దాడులు చేసి, వారి ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా, బాధితులపైనే రివర్స్ కేసులు పెట్టడం ఏ విధమైన న్యాయం? అంటూ రోజా ప్రశ్నించారు.…
కూటమీ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. నేను అవినీతి చేసుంటే నిరూపించండి అని ఛాలెంజ్ చేసిన ఆమె.. ఫైల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి.. నా తప్పు ఎంటో నిరూపించండి అన్నారు.. జగన్ పుట్టిన రోజుల ఒక పండుగ రోజులా జరుపుకుంటున్నాం.. జగన్ లాంటి నాయకుడు దేశంలో రాష్ట్రంలోను లేడని పేర్కొన్నారు.
మాజీ మంత్రి ఆర్కే రోజాపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ శాప్ (ఏపీ స్పోర్ట్స్ అథారిటీ) ఛైర్మన్ రవినాయుడు..పెద్ద అవినీతి తిమింగలం మాజీ మంత్రి ఆర్కే రోజా అని ఆరోపించారు.. ఆడుదాం ఆంధ్ర పేరుతో నిలువు దోపిడీ చేశారని విమర్శించారు.. కేవలం ఎన్నికల స్టంట్స్ కోసం ప్రభుత్వ సొమ్మును దుబారాగా దుర్వినియోగం చేశారని దుయ్యబట్టారు..
ఆ ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారు.. కిషన్ రెడ్డి ఫైర్.. సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తెలంగాణ రాజకీయాలను భ్రష్టు పట్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ వర్క్ షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 35 లక్షల సభ్యత్వం తెలంగాణలో పూర్తి అయిందన్నారు. ఈ నెల చివరి వరకు పోలింగ్ బూత్ కమిటీలు పూర్తి…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి.. అలాగని దొంగ కేసులు పెడితే మేం ఊరుకోం అని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా.. మీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేస్తే రిప్లే ఇవ్వడానికే వందసార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
ఏపీలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. 120 రోజుల్లో 110 ఘటనలు జరిగాయని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. స్కూల్ నుంచి వస్తున్న అమ్మాయికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారని ఆమె తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారంటూ ప్రశ్నించారు. రేప్ జరిగింది అన్న విషయాన్ని కప్పిపెట్టడానికి అనేక హాస్పిటల్స్‌కి తిప్పారని ఆరోపించారు.
ప్రజలు ఓట్లు వేసి గెలిస్తే సరిగ్గా పరిపాలన చేసే వారేమో కానీ ఈవీఎంతో గెలిచారు కాబట్టి పరిస్థితి ఇలా ఉందని మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. హోంమంత్రి విఫలం అయ్యారని తోటిమంత్రి పవన్ చెప్పాడు కాబట్టి అనిత ఆమె పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే, తగలపెడుతుంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటే ఎందుకు చంద్రబాబు, హోంమంత్రి అనితా కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. వీటిపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు తెరవడం లేదని అడిగారు. చంద్రబాబును ఈ జిల్లా వాడు అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నామన్నారు.