Off The Record: ఏపీ పాలిటిక్స్‌లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న లీడర్ ఆర్కే రోజా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో హవా నడిపిన మాజీ మంత్రి… ఓటమి తర్వాత చాలా రోజులు పొలిటికల్ అజ్ఞాతంలో గడిపారు. అప్పట్లో అందరికంటే ఎక్కువగా పవర్‌ని, పదవిని ఎంజాయ్ చేశారన్న పేరు వచ్చింది ఆమెకు. అలాగే నాటి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు ఆమె స్థాయిని దిగజార్చాయన్న అభిప్రాయం ఉంది. ఇక ఓటమి తర్వాత తన మకాంని పూర్తిగా చెన్నైకి మార్చారామె. ఒకానొక దశలో ఇక అక్కడే సెటిలైపోతారా అన్న డౌట్స్ కూడా వచ్చాయట పొలిటికల్ సర్కిల్స్‌లో. కానీ…. ఆ అభిప్రాయం తప్పని, టైం గడిచేకొద్దీ.. రోజా రీఛార్జ్ మోడ్‌లోకి వస్తున్నారని అంటున్నారు ప్రస్తుతం ఎక్కువ మంది. ఇటీవల వివిధ సందర్భాల్లో ఆమె గొంతు సవరించుకుంటున్న తీరు చూస్తుంటే… అది నిజమేనని అనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. తిరుపతి క్యూ లైన్స్‌లో తొక్కిసలాట ఎపిసోడ్‌పై రోజా రియాక్షనే అందుకు ఉదాహరణ అంటున్నారు.
Read Also: Adani : అదానీ తీసుకున్న నిర్ణయం వల్ల కుప్పకూలిన కంపెనీ షేర్లు.. ఒక్కరోజులోనే ఎన్నికోట్ల నష్టమంటే ?
పార్టీ సీనియర్స్ అందరికంటే ముందే రోజా రియాక్ట్ అవడమే కాకుండా… అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు టీడీడీ యంత్రాంగాన్ని ఎండగట్టారామె. సనాతన యోధుడిని అని చెప్పుకునే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటూ ఆయన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విషయంలో కూడా ఇన్నాళ్ళు కాస్త సమన్వయం పాటించిన రోజా… తిరుపతిలో గతంలోలాగే ఓపెన్ అయిపోయారు. ఆయన వల్ల జనానికి చావులు తప్పడం లేదంటూ… కాస్త అభ్యంతరకరమైన పదజాలాన్ని సైతం వాడారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడిదే ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ సబ్జెక్ట్ అయింది. కామ్ అయిపోరారనుకున్న మాజీ మంత్రి ఉన్నట్టుండి ఎందుకు చెలరేగిపోయారు? రీ ఛార్జ్ మోడ్‌లోకి వచ్చి మళ్ళీ తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారా? లేక అంతకు మించిన కారణాలు వేరే ఏవన్నా ఉన్నాయా అన్న చర్చ జరుగుతోంది. అటు వైసీపీ వర్గాలు కూడా ఈ మార్పును ఆసక్తిగా గమనిస్తున్నాయట. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తొలి విడత మంత్రి వర్గ ఏర్పాటులోనే తనకు ఛాన్స్ వస్తుందని ఆశించిన రోజాకు షాకిచ్చారు పార్టీ పెద్దలు. దాని వెనక పార్టీ సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి ఉన్నారన్నది ఆమె అనుమానం.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
మరోసారి అలాంటి స్పెషల్ ఎఫెక్ట్‌లేవీ లేకుండా పొలిటికల్‌గా తనను తాను ప్రొటెక్ట్ చేసే పనిని ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్టు అంచనా వేస్తున్నారు. అందుకే తిరుపతి ఎపిసోడ్‌లో పెద్దిరెడ్డి సహా జిల్లా సీనియర్స్ అంతా అక్కడే ఉన్నా… అందరికంటే ముందు తానే వచ్చి ఓపెనైపోయినట్టు చెప్పుకుంటున్నారు. అంత పెద్ద ఘటనపై పార్టీ తరపున అందరికంటే ముందు స్పందించిన నాయకురాలిగా రోజా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. దానికి తోడు గతంలో పార్టీకి మౌత్‌పీస్‌లు అనుకున్న నాయకులంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. అందుకే ఇది రైట్ టైం అనుకుంటూ… జగన్‌కు నేనే సిసలైన సైనికురాలినని చెప్పుకునే ప్రయత్నం చేశారన్నది ఓ అంచనా. జగన్ తిరుపతి టూర్‌లోనూ పక్కనే ఉంటూ… చెవిరెడ్డి, భూమన కంటే ఎక్కువగా రోజా హడావిడి చేశారన్న అభిప్రాయం ఏర్పడిందట పార్టీ వర్గాల్లో. ఇక ఈ దూకుడును ఇలాగే కొనసాగిస్తే… భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే తనకే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందన్నది రోజా నమ్మకమని చెప్పుకుంటున్నారు ఆమె సన్నిహితులు. ఇక సొంత నియోజకవర్గం నగరిలోనూ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ మాత్రం దూకుడుగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అదే సమయంలో మరో వాదన సైతం ఉంది. రోజా ఎంత ఎగిరెగిరిపడ్డా…అదంతా ఆమె మీదున్న అవినీతి ఆరోపణలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునే వరకేనని… వన్స్ ఆ యాక్షన్ మొదలైతే… పేర్ని నాని లాగా సైలెంట్ అయిపోతారంటూ వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట. భవిష్యత్‌లో యాక్షన్స్, అందుకు రోజా రియాక్షన్స్ ఎలా ఉంటాయోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు.