కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరని మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. రోజుకొకరిపై అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో కూటమి నేతలు చేసిన పనులకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అయ్యాక రెడ్ బుక్…
త్వరలోనే వైఎస్ జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా సహా అవినీతి చేసిన అందరూ జైలుకు పోతారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రంలో ఉండే భూములు మొత్తం దోచుకున్నారని, గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన పంది కొక్కులన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయని విమర్శించారు. పెద్దిరెడ్డి అడవిని ఆక్రమించుకొని గెస్ట్ హౌస్‌లు కట్టుకున్నారు, రోడ్లు వేసుకున్నారని మండిపడ్డారు. రోజా డైలాగులు సినిమాలో పనికి వస్తాయని, రాజకీయాల్లో కాదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు.…
కూటమి ప్రభుత్వం పాలన, సీఎం చంద్రబాబు కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆర్కే రోజా.. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన నడుస్తుందని వ్యాఖ్యానించిన ఆమె.. వైసీపీ మహిళా కార్యకర్తలు నారావారి నరకాసుర వధ చేసేందుకు నడుం బిగించాలి అంటూ పిలుపునిచ్చారు... చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమ కేసులు, అవమానాలు, అత్యాచారాలు, వేధింపులు.. ఇవే సూపర్ సిక్స్‌లు అంటూ ఎద్దేశా చేశారు..
ఆడవాళ్ళు బయటకు తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇవాళ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు.. పవన్, చంద్రబాబుకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడే బయటకు వస్తారు.. పవన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు కోసం ఉన్న నాయకుడు అంటూ మండిపడింది.
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసి.. బెజవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లను కడిగిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు తిరుమలలో జరుగుతోన్న అపచారాలు, ఘోరాలకు ప్రాయశ్చిత్తంగా.. తిరుమల మెట్లను కూడా కడగాలని సూచించారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలపాలయ్యాడు.. అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్చారు.. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, వైసీపీ అధినేత వైఎస్ జగన్, మాజీ మంత్రి ఆర్కే రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.
నాయకుల కంటే కార్యకర్తల పైనే ఎక్కువ నమ్మకం.. నందిగామ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. “2004 లో గెలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది.. హైదరాబాద్ అభివృద్ధి చేశామని.. రాష్ట్ర విభజన తర్వాత 2014 లో మళ్ళీ గెలిచాము.. చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకు వెళ్లడం ముఖ్యం.. కార్యకర్తలు యక్టీవ్ గా లేకపోతే పార్టీకి కష్టం.. మొదటి రోజు నుంచే కార్యకర్తల కోసం కష్టపడుతున్నా.. పార్టీని సమర్ధవంతంగా స్ట్రీమ్ లైన్ చెయ్యడం…
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై హాట్ కామెంట్లు చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. చంద్రబాబు, లోకేష్ కుటుంబాలను బంగారుమయం చేసుకుంటారేమో.. కానీ, పేద ప్రజలకు చేసేదేమీ లేదన్నారు.. చంద్రబాబు మీటింగులకు వచ్చిన జనం మధ్యలోనే వెళ్లిపోతున్నారు.. ఇక, పవన్ కల్యాణ్ ఎక్కడ నిద్రపోతున్నారో అర్ధం కావటం లేదు అని ఎద్దేవా చేశారు.
Off The Record: వైసీపీ మాజీ మంత్రి రోజా టార్గెట్‌గా టీడీపీ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారా? ఆడుదాం ఆంధ్ర వ్యవహారాలపై దర్యాప్తు ఒక్కరోజు మాత్రమే జరిగి ఎందుకు ఆగిందో తమ్ముళ్ళు కనుక్కున్నారా? అందుకే అసెంబ్లీ సాక్షిగా దానికి విరుగుడు మంత్రం వేస్తున్నారా?
సూపర్ సిక్స్ పేరుతో మహిళలను నట్టేట ముంచారు.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదంటూ కూటమి ప్రభుత్వం.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో చంద్రన్న దగ, చంద్రన్న పగ, చంద్రన్న పంగనామం, చంద్రన్న వెన్నుపోటు మాత్రమే అమలవుతున్నాయన్న ఆమె.. చంద్రబాబు మోసాలపై ఏపీ మహిళలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు.. సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేశారని విమర్శించారు. రోజుకు 70 మంది మహిళలు,…