RK Roja Warns Youtube Channel Owners running on Her name: ఒకప్పటి సినీ హీరోయిన్, ప్రస్తుత వైసీపీ ఫైర్ బ్రాండ్ లేడీ లీడర్ ఆర్కే రోజా తన ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు, వెంటనే, నా పేరు పై ఉన్న సదరు ఛానల్స్, అకౌంట్ లను డిలీట్ చేయాలని హెచ్చరిస్తున్నాను లేని పక్షంలో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ పై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అంటూ…
చంద్రబాబు 100 రోజుల పాలనలో జరిగిన అఘాయిత్యాలను కప్పి పుచ్చేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. వరదలు, మహిళలపై వరుసగా జరుగుతున్న దాడులు, వైసీపీ నాయకులపై దాడులు, ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చలేకపోయాడని విమర్శించారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబు ప్రజల దృష్టి మళ్లించే విధంగా లడ్డు వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నారు.
నగరి నియోజక వర్గంలో కీలక నేతగా ఉన్నర కేజే కుమార్, కేజే శాంతిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది వైసీపీ.. ఈ మేరకు లేఖను విడుదల చేశారు చిత్తురు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భరత్.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ స్థానిక నాయకుల ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు
గతంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. తప్పు చేయాలంటేనే ఎవరైనా భయపడేవారు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఏపీలో మహిళల రక్షణ చాలా దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా… ఉన్నట్టుండి ఎందుకు సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఒకటి రెండు సందర్భాల్లో కాస్త సౌండ్ పెంచే ప్రయత్నం చేసినా…. వెంటనే మ్యూడ్ మోడ్ ఆన్ చేయడానికి కారణమేంటి? ప్రస్తుతం పూర్తిగా చెన్నైకే పరిమితమైన రోజాను గతం వెంటాడుతోందా? ఆడుదాం ఆంధ్రాపై ఎంక్వైరీ… ఆడేసుకుంటానని అంటోందా? ఆటలో నెక్స్ట్ పడే వికెట్ ఏది? పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీలో ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్స్ అనగానే ఎక్కువ…
మాజీ మంత్రి రోజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. జిల్లాల్లో సీరియస్ పాలిటిక్స్ నడుస్తోన్న సమయంలో.. కనీసం ఎవరితోనూ టచ్‌లో లేకుండా వెళ్లిపోయిన రోజా.. యూరప్ ట్రిప్‌లో ఎంజాయ్ చేశారట.. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ కావడమే కాదు.. ఆమె డ్రెసింగ్ స్టైల్‌పై కూడా ట్రోలింగ్స్ నడుస్తున్నాయి.
RK Roja Video Viral: ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ గా తెలుగు, తమిళ పరిశ్రమల్లో సత్తా చాటిన రోజా రాజకీయాల కోసం సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు బుల్లితెరలో కొన్ని షోస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు వాటికి కూడా దూరమైన ఆమె 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోర పరాజ్యం పాలయ్యారు. ఆ తర్వాత మీడియాకి కాస్త దూరంగా ఉంటూ వస్తున్న ఆమె అనూహ్యంగా…
RK Roja Intresting post about Politics goes Viral: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 151 స్థానాలు నుంచి ఏకంగా 11 స్థానాలకు పడిపోయింది. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఒకప్పటి హీరోయిన్ రోజా కూడా ఓటమి పాలయ్యారు. ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆమె తెలుగుదేశం అభ్యర్థి గాలి భాను…
ఈ ఎన్నికలు ఐదేళ్ల భవిష్యత్.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు అన్నీ ఆగిపోతాయని అన్నారు ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ఈ 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని.. హామీలు అమలయ్యాయో లేదో ఇంటింటికి పంపించి అడిగే సంప్రదాయం మొదలుపెట్టామన్నారు.