RK Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి.. అలాగని దొంగ కేసులు పెడితే మేం ఊరుకోం అని హెచ్చరించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఆర్కే రోజా.. సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టిన కూటమి కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, చెవి రెడ్డి మోహిత్ రెడ్డి తదితర నేతలు ఫిర్యాదు చేశారు.. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని విమర్శించారు.. మహిళలపై నీచాతినీచంగా పోస్టులు పెడుతున్నారు.. ఫిర్యాదు చేస్తే రిప్లే ఇవ్వడానికే వందసార్లు ఉన్నత అధికారులతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు..
Read Also: Pushpa -2 : పుష్ప -2 ట్రైలర్ పై టాలీవుడ్ సెలెబ్రిటీస్ ఏమన్నారంటే..?
పోలీసులు నెత్తిపై ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ చెసే విధంగా ప్రవర్తించండి అని సూచించారు రోజా.. చంద్రబాబు తప్పులు చేసి ఎదుటి వారిపై బురద చల్లడం అలవాటు.. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబుకు అలవాటే అన్నారు.. సీఎం హోదాలో జగన్ ఉన్న సందర్భాలలోనే నీచమైన పోస్ట్ లను పెట్టారు. ఇప్పుడు వైసీపీ నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు.. సుధారాణి ఆడపిల్ల అని చూడకుండా పోలీసులు ఎలా కొట్టారో కోర్టులో తెలిపారు.. కడపలో సునిత వాళ్ల ఇంటికి అర్థరాత్రి వెళ్లి హింసించారు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పచేస్తే కేసులు పెట్టండి, అలాగని దొంగకేసులు పెడితే మేము ఊరుకోం అని హెచ్చరించారు.. మహిళపై జరుగుతున్న దాడులను ఆపడానికి పోలీసులను వాడండి, అలా కాకుండా వైఎస్ఆర్ పార్టీపై వాడితే తిరుగుబాటు తప్పదని అని వార్నింగ్ ఇచ్చారు .. వైసీపీ హయంలో 36 వేలమంది మిస్ అయ్యారు అని పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారు.. కానీ, అసెంబ్లీ సాక్షిగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 36 మందే అని హోం మినిస్టర్ తెలిపారు.. మరి దీనికి కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా..
Read Also: AP legislative council: మండలి నుంచి మళ్లీ మళ్లీ వైసీపీ వాకౌట్..
ఇక, నారాయణ స్వామి మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్ పై దారుణమైన పోస్టులు పెట్టారు.. మానవ జన్మ ఎత్తిన వారు ఇలాంటి పోస్టులు పెట్టారు అని ఫైర్ అయ్యారు.. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని సూచించారు.. పేదవాడి హృదయం స్థానం సంపాదించింన జగన్ పై లాంటి పోస్టులు పెట్టడం దారుణం.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరోవైపు.. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. 45 నిముషాలు పోలీస్ స్టేషను లో ఉన్నాం.. ఫిర్యాదు చేసిన దానికి రిసివ్ట్ కాపీ ఇవ్వడానికి డ్రామాలు చేశారు.. ఎంపీ, మేయర్‌గా మేం స్వయంగా వస్తేనే ప్రోటోకాల్ వ్యతిరేకంగా ప్రవర్తించారు. కూటమి ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు ఎంపీ గురుమూర్తి..