బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి రిషి సునాక్ విదేశాంగ విధానంపై రిషి సునాక్ ప్రసంగించారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. చైనాతో మాత్రం ఇందుకు విరుద్ధంగా పనిచేస్తామని తేల్చి చెప్పారు.
బ్రిటన్‌లో రిషి సునాక్ సర్కారును వలసలు కలవరపెడుతున్నాయి. ఆ వలసలను తగ్గించేందుకు రిషి సునాక్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే విదేశీ విద్యార్థులపై ఆంక్షలు తీసుకురావాలని యోచిస్తోంది.
Rishi Sunak, Wife Akshata Murty Debut On UK's 'Asian Rich List 2022': యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి యూకే ఆసియా సంపన్నుల జాబితాలో చేరారు. ఆసియన్ రిచ్ లిస్ట్ 2022లో తొలిసారిగా చోటు సంపాదించారు. ఈ జాబితాలో హిందూజా గ్రూప్ కుటుంబం అగ్రస్థానంలో ఉంది. రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె. ఈ జాబితాలో ఆమె 790 మిలియన్ పౌండ్ల…
ఈజిప్టులో జరిగిన కాప్-27 వాతావరణ సదస్సులో కుదిరిన ఒప్పందాన్ని యూకే ప్రధాన మంత్రి రిషి సునాక్ ఆదివారం స్వాగతించారు. అయితే "చేయాల్సింది చాలా ఉంది" అని ఆయన పేర్కొన్నారు.
బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ప్రతి సంవత్సరం యూకేలో పని చేయడానికి భారతదేశం నుంచి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ సమావేశమయ్యారు.
UK's Rishi Sunak Committed To Free Trade Pact With India: ఆర్థిక కష్టాలతో సతమతం అవుతున్న యూకే.. భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి చర్చలు కొనసాగుతన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎన్నికైన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఈ ఒప్పందంపై కసరత్తు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన ఇండియాతో ఈ వాణిజ్య ఒప్పందం కుదిరితేనే బ్రిటన్ ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది.…