ఢిల్లీలో ప్రధాని మోడీని యూకే మాజీ ప్రధాని రిషి సునక్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మోడీతో రిషి సునక్ ప్రత్యేకంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంగళవారం మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు
UK: యూకే మాజీ మంత్రి, హోం సెక్రటరీగా పనిచేసిన సుయెల్లా బ్రేవర్‌మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా మళ్లీ గొప్పగా మారాల్సిన అవసరం ఉందని అన్నారు. బ్రిటన్ ‘‘ముస్లిం ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది’’ అని హెచ్చరించారు. రాబోయే రెండు దశాబ్దాల్లో వెస్ట్రన్ దేశాలు ఇరాన్ తరహా పరిస్థితుల్ని ఎదుర్కోవచ్చని చెప్పారు. బ్రేవర్‌మాన్ రైట్ వింగ్ థింక్ ట్యాంక్, హెరిటేజ్ ఫౌండేషన్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
బ్రిటన్‌లో 2024 ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ, జీవన వ్యయ సంక్షోభం, ప్రజా సేవల కొరత, అక్రమ వలసలతో బ్రిటన్ పోరాడుతోంది. ఇదిలా ఉంటే లేబర్ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయం.. పార్టీ భుజాలపై బాధ్యతల భారాన్ని పెంచింది. బ్రిటన్ ప్రజలు లేబర్ పార్టీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
బ్రిటిష్ పార్లమెంటరీ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) ఘోర పరాజయంతో అధికారానికి దూరమైంది. కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లు మాత్రమే సాధించింది, ఇది 2019లో గత ఎన్నికల కంటే 250 సీట్లు తక్కువ. పరాజయం తర్వాత భారత సంతతికి చెందిన రిషి సునాక్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
బ్రిటన్‌లో జూలై 4న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో లేబర్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించింది. లేబర్ పార్టీ ఇప్పటివరకు 400 సీట్లకు పైగా గెలుపొందింది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పెద్దలు ఓడిపోయారు. నివేదికల ప్రకారం, కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలు, బ్రిటీష్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్ కూడా సౌత్ వెస్ట్ నార్ఫోక్ స్థానం నుంచి ఈ ఎన్నికలలో ఓడిపోయారు.
యూకే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ ఘోర పరాజయాన్ని చవిచూశారు. లేబర్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. ఈ క్రమంలో లేబర్ పార్టీకి చెందిన కీర్ స్టామర్ బ్రిటన్ తదుపరి ప్రధాని అవుతారు. శుక్రవారం జరిగిన జాతీయ ఎన్నికల్లో రిషి సునాక్ ఓటమిని అంగీకరించారు. 650 సీట్లు ఉన్న యూకే పార్లమెంట్‌లో లేబర్ పార్టీ 400 సీట్లకు పైగా గెలుచుకుంది.
యూకే ప్రధాని రిషి సునాక్ దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ పార్టీ 300 సీట్లకు పైగా గెలుచుకున్నట్లు ట్రెండ్‌లు చూపించగా.. సునాక్ కన్జర్వేటివ్ పార్టీ 61 స్థానాల్లో ముందంజలో ఉంది.
UK Election : బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలకు ముందు గురువారం ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. దీని ప్రకారం లేబర్ పార్టీ నేత కైర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని కానున్నారు.
Indian Origin Candidates in UK Election 2024: యునైటెడ్ కింగ్‌డమ్(UK)లో జూలై 4న సాధారణ ఎన్నికలు జరుగుతాయి. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు, ప్రధానమంత్రి రిషి సునక్ ప్రతిష్ట ప్రమాదంలో పడింది.