Rishi Sunak : నేను నటించాలనుకోవట్లేదు.. కొత్త ఏడాదిలో కష్టాలు తప్పవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లల్లో ఈ ఏడాదిని యూకేకు కష్టకాలంగా అభివర్ణించారు. అయితే సమస్యలు తీరిపోలేదని, వచ్చే ఏడాదిలోనూ కొనసాగుతాయన్నారు. రాబోయే ఏడాదిలో దేశ సమస్యలు తీరిపోతాయని తాను చెప్పనన్నారు. తాను నటిస్తూ అబద్ధాలు చెప్పనన్నారు. కానీ, 2023 ప్రపంచ వేదికపై అత్యుత్తమ ప్రదర్శనకు బ్రిటన్‌కు ఒక అవకాశం ఇస్తుందని మాత్రం చెప్పగలనన్నారు. ఉక్రెయిన్ యుద్ధం.. బ్రిటన్ ముందున్న అతిపెద్ద సవాల్. కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో.. రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగింది.
Read Also: Alok Sharma : భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం.. బ్రిటన్ రాజు చేతుల మీదుగా నైట్ హుడ్ అవార్డు
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- TDP-Janasena Seat Sharing Talks: సీట్ల లొల్లి.. కూటమి ముందు జనసేన భారీ డిమాండ్..
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ఈ యుద్ధం బ్రిటన్‌తో పాటు యావత్ ప్రపంచంపై ఆర్థికంగా ప్రభావం చూపెట్టింది. బ్రిటన్ సైతం ఆ ప్రతికూలత నుంచి కోలుకోలేకపోయింది. ఇక్కడి పౌరులపై ఆ ప్రభావం పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే తన ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. అయినప్పటికీ.. అవి సహేతుకంగా ఉన్నాయని భావిస్తున్నట్లు చెప్పారు రిషిసునాక్. మూడు నెలల కిందట.. ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి విరామం లేకుండా పని చేస్తున్నామన్నారు. అందులో భాగంగా జాతీయ వైద్య సేవలను పునరుద్ధరించే పనులు వేగం పుంజుకుందని రిషి సునాక్ తెలిపారు. అలాగే.. అక్రమ వలసలను సైతం అడ్డుకుంటున్నామని, ప్రత్యేకించి నేరగాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. రాబోవు రోజుల్లోనూ తమ దేశం ఉక్రెయిన్‌కు తమ మద్ధతుగా నిలుస్తుందన్నారు.
2023 will have its challenges, but the government I lead will always put your priorities first.
My New Year message 👇 pic.twitter.com/KatjfHHjty
— Rishi Sunak (@RishiSunak) December 31, 2022
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..