PM Narendra Modi: ప్రధాని మోడీతో రిషి సునాక్ భేటీ.. కాసేపటికే బ్రిటన్ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ ప్రతి సంవత్సరం యూకేలో పని చేయడానికి భారతదేశం నుంచి యువ నిపుణుల కోసం 3,000 వీసాలకు అనుమతి ఇచ్చారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ సమావేశమయ్యారు. బాలిలో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోడీ యూకే ప్రధాని రిషి సునాక్‌తో సంభాషించారు. వారిద్దరు కలుసుకున్న కాసేపటికే బ్రిటన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని యువ నిపుణులకు ప్రతి ఏడాది 3,000 వీసాలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది.
గతేడాది అంగీకరించిన యూకే-ఇండియా మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్యంలో భాగంగా, ఈ పథకం నుంచి ఇలాంటి లబ్ధి పొందిన మొదటి దేశం భారతేనని అని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెలలో భారత సంతతికి చెందిన తొలి బ్రిటీష్ ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది వారి మొదటి సమావేశం. యూకే-ఇండియా యంగ్ ప్రొఫెనల్స్ పథకం కింద 18-30 ఏళ్ల డిగ్రీ పూర్తి చేసిన భారత పౌరులు యూకే వచ్చి రెండేళ్లపాటు ఉండేందుకు 3 వేల వీసాలను అందిస్తున్నట్టు యూకే ప్రధాని కార్యాలయం ఓ ట్వీట్‌లో పేర్కొంది. జీ 20 సమ్మిట్‌లో యూకే, భారత ప్రధానులు కలుసుకుని మాట్లాడినట్టు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది.
Also Read
G20 Summit: ప్రధాని మోదీకి అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సెల్యూట్..
ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాల కంటే బ్రిటన్‌కు భారత్‌తో ఎక్కువ సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. యూకేలోని అంతర్జాతీయ విద్యార్థులలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది భారతదేశానికి చెందినవారు. యూకేలో భారతీయ సంతతికి చెందిన వారు పెట్టుబడుల వల్ల దాదాపు 95 వేల మంది ఉపాధి లభిస్తోంది. యూకే ప్రస్తుతం భారతదేశంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. ఒకవేళ అంగీకరించినట్లయితే, ఇది భారతదేశం ఒక యూరోపియన్ దేశంతో చేసుకున్న మొదటి ఒప్పందం అవుతుంది. వాణిజ్య ఒప్పందం ఇప్పటికే 24 బిలియన్ పౌండ్ల విలువైన యూకే-భారత్ వాణిజ్య సంబంధాలపై ఆధారపడి ఉంటుంది.
- Tags
- Bali
- G20 Summit
- india
- Indonesia
- PM Modi
తాజావార్తలు
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!