యూకేలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేయక తప్పలేదు. ప్రస్తుతం కొత్త ప్రధానిని ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్నారు. అయితే తొలిసారిగా యూకే ప్రధాని ఎన్నికలు ఇండియాలో కూడా చాలా ఆసక్తి క్రియేట్ చేస్తున్నాయి. దీనికి కారణం భారత సంతతి వ్యక్తి రిషిసునక్ ప్రధాని రేసులో ఉండటమే. రిషి సునక్ తో పాటు మరో భారత సంతతి వ్యక్తి సుయెల్లా బ్రేవర్‌మన్ కూడా ప్రధాని పోటీలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు…
బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్ తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రధాని పదవితో పాటు కన్జర్వేటివ్ పార్టీ చీఫ్ గా ఎవరెన్నిక అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోటీలో భారత సంతతి వ్యక్తి రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాను ప్రధాని రేసులో ఉంటానని అందరి కన్నా ముందుగానే ఆయన స్పష్టం చేశారు. తాజాగా మంగళవారం సాయంత్రం ప్రధానమంత్రి పోటీకి సంబంధించి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం…
వరసగా 50 మందికి పైగా మంత్రులు రాజీనామా చేయడంతో బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీంతో ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి గురువారం రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ నేతను, కొత్త ప్రధానిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే యూకే పీఎం రేసులో భారతీయ సంతతి వ్యక్తి, బోరిస్ జాన్సన్ మంత్రి వర్గంలో సభ్యుడిగా ఉన్న రిషి సునక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా ఆయన యూకే ప్రధాని కావడానికి తనవంతు ప్రయత్నాలు…
యూకే రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రధాని బోరిస్ జాన్సన్ పై విశ్వాసం లేకపోవడంతో 40కి పైగా మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో చేసేందేం లేక ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బోరిస్ జాన్సన్ సన్నిహితుడు క్రిస్ కు మద్దతుగా నిలిచినందుకు అధికార పార్టీ సభ్యులే ప్రధాని బోరిస్ జాన్సన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ప్రవర్తనతీరపై కూడా…
బ్రిటన్‌లోని శ్రీమంతుల జాబితాపై సండే టైమ్స్ అనే సంస్థ ఈ ఏడాది సర్వే చేసి 250 మంది పేర్లను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో బ్రిటన్ ఆర్థిక మంత్రి, భారత్‌కు చెందిన రిషి సునాక్, ఆయన భార్య అక్షతామూర్తి 222వ స్థానంలో నిలిచారు. ఈ దంపతుల ఆస్తుల విలువ రూ.7074 కోట్లుగా సండేటైమ్స్ ప్రకటించింది. గత 34 ఏళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని శ్రీమంతుల జాబితాను సండే టైమ్స్ ప్రతి ఏడాది విడుదల చేస్తోంది. అయితే తొలిసారి ఈ…
ఒకప్పుడు భారత దేశాన్ని దోచుకున్న ఆంగ్లేయులకు ఇప్పుడు ఓ భారతీయుడు ప్రధాని కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేలాడుతోంది. దీంతో తదుపరి ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతత వ్యక్తి, బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సూనక్ నియమితులవుతారని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది. 2020 మే నెలలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని బోరిస్ పెద్ద ఎత్తున మందు పార్టీ చేసుకున్నారన్న…