వరదల వల్ల నష్టపోయిన జిల్లాకు సీఎం కేసీఆర్ వెంటనే పునర్నిర్మాణ పనులకు 500 కోట్ల రూపాయలను కేటాయించారు అని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడ్డారు అని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.
గృహనిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలందించారు. గడిచిన 45 రోజుల్లో హౌసింగ్ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామని అధికారులు తెలిపారు.
CM YS Jagan: విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. వేసవిలో విద్యుత్ డిమాండ్, రైతులకు విద్యుత్ కనెక్షన్లు, నాణ్యమైన విద్యుత్ సరఫరా తదితర అంశాలపై సమీక్ష జరిపారు సీఎం.. ఫిబ్రవరి 2వ వారం నుంచే విద్యుత్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో.. మార్చి, ఏప్రిల్ నెలలో సగటున రోజుకు 240 మిలియన్ యూనిట్లు వినియోగం అంచనా వేస్తున్నారు.. ఇక, ఏప్రిల్‌లో 250 మిలియన్ యూనిట్లు…
గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మునుగోడుకు మంత్రులు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు.
CM Jagan: అమరావతిలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు వ్యవసాయ శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని.. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా అధికారులు ధాన్యం సేకరణ కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. అటు ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా…
CS Sameer Sharma Falls Sick: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.. వెంటనే ఆయన్ను అధికారులు ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు.. అయితే, సమీర్ శర్మ గత నెలలో కూడా అస్వస్థతకు గురయ్యారు.. ఇటీవలే హైదరాబాద్‌లో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల నుంచి విధులకు…
CM Jagan: వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లోనూ గెలవాలని వైసీపీ అధినేత, సీఎం జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు వైసీపీ నేతలకు ఈ అంశంపై ఆయన దిశానిర్దేశం చేశారు. తాజాగా టీడీపీ ఖాతాలో ఉన్న 18 అసెంబ్లీ నియోజకవర్గాలపై సీఎం జగన్ బుధవారం నాడు వైసీపీ నేతలతో వరుస సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 18 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశాన్ని కుప్పం సెగ్మెంట్ నుంచి ప్రారంభించారు. అనంతరం అద్దంకి, టెక్కలి నియోజకవర్గ నేతలతోనూ…
CM Jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా నగరాల్లో పరిశుభ్రత, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్‌మెంట్, నగరాలు, పట్టణాల్లో సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, టిడ్కో ఇళ్ల నిర్మాణం, వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్, జగనన్న స్మార్ట్‌టౌన్‌షిప్స్ వంటి అంశాలపై సీఎం జగన్ రివ్యూ చేశారు. ముఖ్యంగా కృష్ణానదికి వరద ముంపు రాకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం రిటైనింగ్ వాల్…