CS Sameer Sharma Falls Sick: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమరావతిలోని ఏపీ సచివాలయంలో బ్యాంకు అధికారులతో సమీక్ష చేస్తున్న సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు.. వెంటనే ఆయన్ను అధికారులు ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చారు.. అయితే, సమీర్ శర్మ గత నెలలో కూడా అస్వస్థతకు గురయ్యారు.. ఇటీవలే హైదరాబాద్‌లో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.. ఆ తర్వాత దాదాపు వారం రోజుల నుంచి విధులకు హాజరవుతున్నారు.. ఇవాళ సచివాలయంలో సమీక్ష చేస్తున్న సమయంలో మరోసారి అస్వస్థతకు గురయ్యారు.. ఓ పక్కకు ఒరిగిపోయిన సీఎస్‌ను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు.. ప్రస్తుతం సీఎస్ సమీర్ శర్మ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Tirumala Temple: శ్రీవారి భక్తులకు అలర్ట్.. 8న శ్రీవారి ఆలయం మూసివేత..
కాగా, ఇవాళ సచివాలయంలో సీఎస్ సమీర్ శర్మతో భేటీ అయ్యింది ఎస్బీఐ నవీన్ చంద్ర ఝా సీజీఎం బృందం.. అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ఈ సమావేశం జరిగింది.. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా అమలు చేస్తున్న వివిధ రుణ సౌకర్యాలకు సంబంధించిన పథకాలు, బీమా, ఉద్యోగులకు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి సీఎస్‌కు వివరించారు.. అదే విధంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ద్వారా ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సేవల గురించి ఎస్బీఐ ఉన్నతాధికారులు వివరాలు చెప్పారు.. ఈ సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొనగా.. సమావేశంలోనే అస్వస్థతకు గురయ్యారు సీఎస్ సమీర్ శర్మ.