CM Jagan: రైతుల ధాన్యం సేకరణను అధికారులందరూ సవాల్‌గా తీసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: అమరావతిలోని తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సోమవారం నాడు వ్యవసాయ శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నామని.. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా అధికారులు ధాన్యం సేకరణ కొనసాగించాలని సీఎం జగన్ సూచించారు. అటు ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరకు రైతులు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని.. దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. ఇ-క్రాపింగ్ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో సేకరణ కొనసాగాలని సూచించారు. వ్యవసాయశాఖతో పౌరసరఫాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also: Minister Roja: జగన్ తగ్గేది లేదు.. చంద్రబాబు, పవన్ నెగ్గేది లేదు..!!
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
రబీ సీజన్‌కు అధికారులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. ఎరువులు, విత్తనాలు వంటి రైతులకు కావాల్సివన్నీ సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలని.. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్ ఉండేలా చూడాలని సూచించారు. అనంతరం ప్లాంట్ డాక్టర్స్ కాన్సెప్టుపై సీఎం జగన్ అధికారులతో సమీక్షించారు. భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని.. ఈ పరికరాలను అన్ని ఆర్బీకేలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు కారణంగా ఏ ఎరువులు వాడాలి? ఎంతమేర వాడాలన్న దానిపై స్పష్టత వస్తుందన్నారు. దీని వల్ల పెట్టుబడి తగ్గి దిగుబడులు పెరుగుతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా భూసారాన్ని పరిరక్షించుకునేందుకు అవకాశం ఏర్పాడుతుందన్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!