పొగాకు, మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు సీఎం చంద్రబాబు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరలపై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు.
మార్చి 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్ల పై డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సమగ్ర కుల గణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణన ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం అన్నారు.
తెలంగాణకు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (ఐఎస్ఆర్‌డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలనే విషయంపై కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
CM Revanth Reddy: కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై అధికారులతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా గోషామహల్ లో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
BCCI Review Meeting: భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో పరాజయం పాలవడంతో, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రేసు నుంచి దూరమైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టీమిండియా ప్రదర్శనపై సీరియస్ ఆలోచన చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమవారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇటీవల శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్ ఓటమి, న్యూజిలాండ్‌తో స్వదేశంలో 0-3తో ఓటమి, అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమికి గల కారణాలపై…
సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోందని.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96 శాతం పూర్తి చేసినందుకు జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలిపారు.
విద్య, వైద్యం, వ్యవసాయం, త్రాగు, సాగునీటిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెనాయుడు మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసింది అని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగాయే కానీ, ఏలాంటి సేవలు అందించడం లేదని పేర్కొన్నారు.
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలపై కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితిని సీఎంకు కలెక్టర్లు, అధికారులు వివరించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
CM Chandrababu: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.