ధరణి పునర్నిర్మాణ కమిటీ ఇవాళ సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో సమావేశం కాబోతుంది. రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లను ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే వారికి సమాచారం పంపింది.
ఖమ్మం జిల్లా ఉన్నాతాధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆగిన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మంచినీటి సమస్య కొరత లేకుండా చూడాలి అని తెలిపారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడింది అని పేర్కొనింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో రెండో రోజు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ అమలాపురం పార్లమెంట్ కు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లతో ఆయన మాట్లాడనున్నారు.
అర్హులైన లబ్ధిదారులకు 6 గ్యారంటీ పథకాలు ద్వారా లబ్ది పొందేందుకు వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్ లకు వచ్చి తమ విన్నపాలను అందించేందుకు షెడ్యూల్డ్ సమాచారాన్ని తప్పని సరిగా చేరేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ తెలిపారు.
నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్ రింగ్ రోడ్‌కు బయట, రీజినల్ రింగ్ రోడ్‌కు లోపల 500 నుండి 1000 ఎకరాల మేరకు భూములను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విమానాశ్రయాలకు, జాతీయ రహదారులు, స్టేట్ రహదారులకు 50 నుండి 100 కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పై సోమవారం డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క…
మేడారం జాతరపై మంత్రి సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరను జయప్రదం చేస్తామన్నారు. ఫిబ్రవరి 21 నుండి జాతర ప్రారంభం అవుతుందని సీతక్క తెలిపారు. ఇప్పటికే రూ.75 కోట్ల నిధులు సీఎం రేవంత్ రెడ్డి మంజూరు చేశారని పేర్కొ్న్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర సైతం మేడారం దేవతల సన్నిధి నుండే ప్రారంభించారని మంత్రి అన్నారు. మేడారం జాతర కోసం అడగ్గానే నిధులు కేటాయించారని మంత్రి సీతక్క పేర్కొన్నారు.…
రాష్ట్రంలో పోలీస్ నియామక పక్రియను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్, వైద్య ఆరోగ్యశాఖలో నియామకాలపై నేడు డా.బీ.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్‌లో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖపై మంత్రి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై తీసుకుంటున్న విషయాలను గురించి ఆరా తీసిన మంత్రి..