వినేవాడు వుండాలే గానీ చెప్పేవాడు వేదాంతం చెబుతాడు. బంగారాన్ని ఎలుకలు, పందికొక్కులు తినేస్తాయి. వైన్ షాపుల్లో మందు కూడా ఎలుకలే తాగేస్తుంటాయి.. వేల కోట్ల రూపాయల దాణాను చిటికెలో పశువులు తినేస్తాయి.. సినిమాల్లో చూపించినట్టు పోలీస్ గన్ ఎవరో ఎత్తుకుపోతారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. తిరుపతిలో యూనిఫాం లేకుండా సమావేశానికి వచ్చిన ఓ వీఆర్వో ఇచ్చిన సమాధానం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. తిరుపతిలో యూనిఫాం ఎలుకలు కోరికేశాయ్ మేడం అంటూ బదులిచ్చాడు వీఆర్వో. ఈ నిర్లక్ష్యపు సమాధానంతో వీఆర్వోపై సస్పెన్షన్ వేటు పడింది.
Read Also: Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే అపజయం ఉండదు
సచివాలయ ఉద్యోగులతో నగర సమస్యలపై జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు తిరుపతి కమీషనర్ హరిత. అయితే ఈ సమావేశానికి అంతా హాజరయ్యారు. కానీ యూనిఫారం లేకుండా హాజరయ్యాడు వీఆర్వో ప్రసాద్. అందరూ యూనిఫారంతో వచ్చారు నీవు ఎందుకు రాలేదని ప్రశ్నించారు కమీషనర్ హరిత. నా యూనిఫాం ఎలుకలు కోరికేశాయని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు వీఆర్వో. ఇటు పనిలోను వెనుకంజులో ఉండటం, నిర్లక్ష్యపు సమాధానంపై సీరియస్ అయ్యారు కమీషనర్. వీఆర్వోను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు నగర కమీషనర్ హరిత. ఈ ఘటన తిరుపతిలో హాట్ టాపిక్ అవుతోంది.యూనిఫాంని ఎలుకలు కొరికేయడం ఏంటి? నువ్వేం చేస్తున్నావ్ అంటూ అక్కడికొచ్చినవారు కామెంట్లు చేశారు. ఏది ఏమైనా ఎలుకలు మాత్రం వీఆర్వోకి పెద్ద శిక్షే వేశాయి.
Read Also: US Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఐదుగురు దుర్మరణం