గృహనిర్మాణశాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంపై సీఎంకు అధికారులు వివరాలందించారు. గడిచిన 45 రోజుల్లో హౌసింగ్ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేశామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 3.70 లక్షల ఇల్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రూఫ్ లెవల్.. ఆపైన నిర్మాణంలో ఉన్నవి 5.01లక్షల ఇళ్లు.. త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు అధికారులు. మరో 45 రోజుల్లో వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు సీఎం జగన్ కు వివరించారు. బేస్‌మెంట్ లెవల్ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64లక్షలుపైనే.. వీటి పనులనూ వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read : Imran Khan: “బంగ్లాదేశ్” లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు.. ఇమ్రాన్ ఖాన్ వార్నింగ్..
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జగనన్నకు చెబుదాం స్పెషల్ ఆఫీసర్లు కూడా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారని అధికారులు వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణంలో వాడే మెటీరియల్ నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తున్నామన్నారు. సీఎం ఆదేశాల మేరకే ఇళ్ల లబ్ధిదారులైన మహిళలకు మరింత భరోసాగా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటివరకూ 11.03 లక్షల మందికి రూ. 35 వేల చొప్పున రుణాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రూ. 3, 886.76 కోట్లమేర పావలా వడ్డీకే రుణాలు ఇచ్చినట్లు అధికారులు సీఎం జగన్ కు వివరించారు.
Also Read : IPL 2023 : అమీతుమీకి సిద్ధమైన ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్
ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే…: సీఆర్డీయే ప్రాంతంలో పేదలకు ఇళ్లనిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన అనంతరం.. వేగంగా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలని సీఎం జగన్ చెప్పారు. ఇళ్లులేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పేదలకు ఎంత త్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంత బాగుపడతాయని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు.
Also Read : BT Group: 55,000 ఉద్యోగాలను తొలగించనున్న యూకే టెలికాం దిగ్గజం
సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నామన్న అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ల్యాండ్ లెవలింగ్ పనులు చేశామన్నారు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 5024 టిడ్కో ఇళ్లను ప్రభుత్వం అందించనుంది. ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు పలు శాఖల అధికారులు, స్పెషల్ సీఎస్ లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.