అమరావతి సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ.. మొదటిసారి వర్క్‌షాపుతో పోలిస్తే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో పురోగతి బాగుందన్నారు. కానీ అందరికీ ఒక విషయాన్ని సవినయంగా తెలియజేస్తున్నానని.. పరీక్ష రాసేటప్పుడు షార్ట్‌కట్స్ ఉండవని.. షాట్‌కర్ట్స్‌కు మనం తావిస్తే ఆ పరీక్షల్లో ఫెయిల్ అవుతామన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం అని… ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించుకోవాలని హితవు పలికారు.…
CM Jagan Mohan Reddy: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ం అధ్యక్షతన రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపై సీఎం జగన్ స్వయంగా సమీక్షించారు. అయితే గడప గడపకు కార్యక్రమం విషయంలో పలువురు ఎమ్మెల్యేలు వెనుకబడటంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 27 మంది ఎమ్మెల్యేలకు ఆయన క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. 27 మంది పేర్లతో…
CM Jagan Review Meeting: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈఏపీ (ఎక్స్‌టర్నెల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్)పై అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా న్యూడెవలప్‌మెంట్ (ఎన్డీబీ)బ్యాంకు, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా), ప్రపంచ బ్యాంకు, కేఎఫ్‌బీ బ్యాంకుల రుణ సహాయంతో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. మొత్తం 10 ప్రాజెక్టుల కోసం రూ. 25,497.28 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పనుల్లో…
Minister PeddiReddy Ramachandra Reddy: ఏపీలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల బొగ్గు అవసరాలకు అనుగుణంగా ఎటువంటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇంధనశాఖ అధికారులను గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఇంధన, గనులు, ఎపిఎండిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఇడిసిఎపి రూపొందించిన హ్యాండ్ బుక్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు దేశీయంగా లభిస్తున్న…
CM KCR-TRS: కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను ఆయన సమీక్షించినట్లు సమాచారం.
CM Jagan Review Meeting on Education Department: ఏపీలో విద్యాశాఖపై అధికారులతో శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కీలక సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలను జారీ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాకుండా పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నాడు-నేడు కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు పాఠశాలల నిర్వహణ కోసం…
CM Jagan Review Meeting On Education Department: అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై శుక్రవారం నాడు అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసులో డిజిటల్ బోధన చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇంటరాక్టివ్ డిస్‌ప్లే లేదా ప్రొజెక్టర్లతో ప్రభుత్వ బడిపిల్లలకు మరింత విజ్ఞానం పెరుగుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. నాడు-నేడు రెండో దశ కింద 22,344 స్కూళ్లలో చేపడుతున్న పనుల ప్రగతిని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.…
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వానల నేపథ్యంలో రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, డ్యాంలు, రిజర్వాయర్లలోని నీటి పరిస్థితి గురించి సీఎం ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ సంబంధిత చర్యల గురించి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, పోలీస్, వైద్య, విద్యా…
రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులపై మంగళవారం మధ్యాహ్నం అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన పనులు ఎక్కడా కూడా పెండింగ్‌లో ఉండకూడదని.. వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ హితవు పలికారు. గుంతలు లేకుండా…