తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో ఇటీవల తుఫాన్ కారణంగా దెబ్బ తిన్న పంటలు, రంగు మారిన వరి ధాన్యం కొనుగోలుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాన్ బాధిత ప్రాంతాల్లో రైతులను ఆదుకుంటున్న చర్యలపై చర్చించారు.
రాష్ట్ర రైతాంగానికి దన్నుగా ఉండేలా వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వ్యవసాయశాఖ కార్యదర్శి కార్యాలయంలో మంగళవారం రెండు శాఖల ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల పనితీరు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మల మాట్లాడుతూ.. వ్యయవసాయ రంగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారిస్తున్నారన్నారు. సాగురంగంలో…
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి అని సూచించారు. ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం.. మనం పూర్తిగా బాధ్యతాయుతంగా, జవాబు దారి తనంతో పని చేయాలి అని తెలిపారు.
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఎల్లుండి (గురువారం) జరగనున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
ఈ నెల 7న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సీఎం జగన్ మాట్లాడుతూ.. డ్రై రేషన్ పంపిణీ పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి అని తెలిపారు. ఇప్పుడు అమలవుతున్న విధానంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.. రేషణ్ నాణ్యత విషయంలో ఎక్కడా లోపాలు ఉండకూడదు అని అధికారులకు సీఎం చెప్పారు.
విశాఖ పట్నంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ అధ్యక్షతన VMRDAలో జరిగిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి సురేశ్ మాట్లాడుతూ.. సమీప భవిష్యత్ లో సరికొత్త విశాఖను చూడబోతున్నాం అని ఆయన పేర్కొన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది.