అర్హులైన లబ్ధిదారులకు 6 గ్యారంటీ పథకాలు ద్వారా లబ్ది పొందేందుకు వార్డులో ఏర్పాటు చేసిన కౌంటర్ లకు వచ్చి తమ విన్నపాలను అందించేందుకు షెడ్యూల్డ్ సమాచారాన్ని తప్పని సరిగా చేరేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ తెలిపారు. ఇక, జీహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు జరుగు ప్రతిష్టాత్మక ప్రజా పాలన కార్యక్రమం ఎలాంటి లోటు పాట్లు లేకుండా సమర్థవంతంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇవాళ (సోమవారం) జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తో కలిసి పరిధిలో నియమించిన సర్కిల్ ప్రత్యేక అధికారులు, జోనల్ కమిషనర్లు ఏర్పాట్లను సమీక్షించారు.
Read Also: Chiranjeevi : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి
ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రోస్ ప్రజా పాలన కార్యక్రమం సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటు చేసిన వివరాలను ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. వార్డులో నాలుగు లేకేషన్లలో ఒక్కొక్క లొకేషన్ లో 3 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అర్జీదారులు ఎక్కువగా ఉన్న పక్షంలో అదనంగా మరో కొన్నీ కౌంటర్లు అవసరమైన మేరకు ఏర్పాట్లు చేయినట్లు మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 లోకేషన్స్ లో ఏర్పాటు చేస్తున్నట్లు అందుకు 5 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మారో 5 వేల మంది వాలంటీర్లను ఏర్పాటు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రజా పాలన కార్యక్రమం డిసెంబర్ 31, జనవరి 1 ఈ రెండు రోజులు మినహా మిగతా రోజులు నిర్వహించ నున్నట్లు ఈ సందర్భంగా కమిషనర్ వివరించారు.