Minister Seethakka: మిషన్ భగీరథ, స్త్రీ శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాలతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖపై మంత్రి అనసూయ సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై తీసుకుంటున్న విషయాలను గురించి ఆరా తీసిన మంత్రి.. నివారణ చర్యలు కూడా తీసుకోవాలని మిషన్ భగీరథ శాఖలోని చీఫ్ ఇంజనీర్లు సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ నిశితంగా పర్యవేక్షించాలని, రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి రోజు వారీ నీటి సరఫరా జరిగేలా చూడాలని ఆమె ఇంజనీర్లను చెప్పారు.
Read Also: Amrapali Kata: హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి బాధ్యతల స్వీకరణ
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
ఇక, రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, నదుల తదితర తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క సూచించారు. రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పారు. మిషన్ భగీరథ ప్రాముఖ్యతపై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో అవగాహన ప్రచారానికి ఏర్పాట్లు చేయాలని సీఈలు, ఎస్‌ఈలకు మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. ఇక, మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి పూర్తిస్థాయిలో ముఖ్య కార్యదర్శి స్మిత సభర్వాల్ మంత్రి సీతక్కి వివరించారు. అలాగే, మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసి విజయవంతం చేయాలని మంత్రి తెలిపారు. త్వరలో మేడారం జాతరపై లైన్ డిపార్ట్‌మెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని సీతక్క వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?