తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శాసన సభను కూడా వాళ్ళ అబద్ధాలను నిజాం చేసుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్ కూడా వారికి రూల్స్ తెలియజేసే ప్రయత్నం చేయడం లేదన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఈ-ఫార్ములా రేసు కోసం విదేశీ కంపెనీకి నిబంధనలతు విరుద్ధంగా నిధులు బదలాయించారన్న కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ-ఫార్ములా రేసు నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. న్యాయనిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని.. సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగింది. డిసెంబర్ 28న భూమిలేనివారికి రూ.6 వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 18న టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ బుధవారం నాడు ఉదయం 11 గంటలకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Harish Rao : అమీన్ పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్లో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయ్యాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు బంధు, యాదవులకు గొర్రెల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు నిలిపేశారన్నారు. హైడ్రా పేరుతో విధ్వంసం చేయడమే తప్ప, ఏడాది పాలనలో ఒక్క నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని…
MLC Kavitha : మన సంస్కృతిపై దాడి జరుగుతుంటే ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ తల్లిపై ప్రేమ లేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి రూపం మార్చారని విమర్శించారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్లుంటుందన్నారు. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది… అందరం కలిస్తేనే అందమైన సమాజం అవుతుందన్న సందేశం ఇచ్చేది బతుకమ్మ అంటూ కవి పేర్కొన్నారు. అలాంటి…
Boora Narsaiah Goud: తెలంగాణ ప్రగతి, ప్రతిష్ట తిరోగమనంలో పయనిస్తోందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో హైదరాబాద్ అంటే ఫాస్టెస్ట్ గగ్రోయింగ్ సిటీ అనే పేరు ఉండేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక 6 మోసాలు.. 66 అబద్ధాలు అన్నట్లుగా పరిస్థితి మారిందన్నారు బూర నర్సయ్య. గల్లీలో తిట్లు.. ఢిల్లీలో మెట్లు.. దేవుళ్లపై ఒట్లు.. సర్కార్ దీనికే పరిమితమైందని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మొదలు ఇప్పటి…
CM Revanth Reddy : గ్లోబల్ మాదిగ డే-2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒక స్పష్టమైన ప్రకటన చేశారని, మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేసామని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు…
Harish Rao : ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన సీఎం రేవంత్.. ఈనెల 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ నోట్ విడుదల చేశారు. 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి ఉంది ఆయన పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో మీరు సాధించిన ఘనత…