Rasamayi Balakishan : కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి సాయిరాం గార్డెన్‌లో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. తెలంగాణ పార్టీ ఏది అంటే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ జెండానే చూపిస్తారన్నారు. దేవుడులాంటి కేసీఆర్‌ను దూరం చేసుకొని దయ్యం లాంటి రేవంత్ రెడ్డి తెచ్చుకున్నమని ప్రజలంతా బాధపడుతున్నారని, అర గ్యారెంటీ అమలు చేసి ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయని ప్రజలందరినీ మభ్యపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 119 నియోజకవర్గంలో అత్యంత అవినీతిపరుడు ఎమ్మెల్యే మన కవ్వంపల్లి సత్యనారయణ రెండవ స్థానంలో ఉన్నాడని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సర్వే రిపోర్ట్ లో తేలిందని, పదేండ్ల పాలనలో పల్లెలన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి చేశామన్నారు రసమయి బాలకిషన్.
Donald Trump: అమెరికా అధ్యక్షుడైన తొలి రోజు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ట్రంప్ సంతకం..
అంతేకాకుండా.. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలని సుమారు 45 డబల్ బెడ్ రూం కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కాంట్రాక్టర్ ఇస్తే వారు వాటిని కట్టలేదని, ఇప్పుడు ఎమ్మెల్యే పొంగులేటి నీ కలిసి డబుల్ బెడ్ రూం లను పూర్తిచేయాలన్నారు. ప్రజలకిచ్చిన హామీలపై నేను ప్రశ్నిస్తే నాకు లాయర్ ద్వారా 5 కోట్లు కట్టుమని నోటీస్ పంపించాడని, ఎమ్మెల్యే కవ్వంపల్లి అక్రమ వసూళ్ల గురించి NTV లో వచ్చిన కథనం పట్ల స్పందించిన ఎమ్మెల్యే అని ఆయన వ్యాఖ్యానించారు. షాడో ఎమ్మెల్యే తో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ వసూళ్లకు ఎమ్మెల్యే పాల్పడుతున్నాడని, ప్రభుత్వ పథకాల విషయంలో ఏదైనా లబ్ధి కావాలంటే ప్రతి పనికి ఒక రెట్ నిర్ణయించి అర్థరాత్రి క్యాంప్ కార్యాలయంలో షాడో ఎమ్మెల్యేతో కలిసి అప్లికేషన్ లపై ట్రిక్కులు పెడుతారన్నారు.
Somu Veerraju: కేంద్రం సహకారంతో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది..