మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటన్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు మొట్ట మొదటిసారిగా మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక శాఖ మంత్రి నియమించారని గుర్తు చేశారు. 15 టన్నుల బంగారాన్ని కుదవపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ…
మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ అనారోగ్య కారణాలతో 26 డిసెంబర్ రాత్రి తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. సీఎంతోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎంపీలు ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Thamma reddy : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పుష్ప 2 బెనిఫిట్ షోలో భాగంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కన్నుమూసిన సంగతి తెలిసిందే.
CM Revanth Reddy : మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ ప్రధానిని గొప్ప ఆర్థికవేత్తలు, నాయకులు, సంస్కర్త , అన్నింటికంటే మానవతావాది అని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ సద్గుణం, నిష్కళంకమైన చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని, అన్నింటికీ మించి నిర్ణయం తీసుకోవడంలో మానవీయ స్పర్శతో గుర్తించబడ్డారని రేవంత్ రెడ్డి ఒక…
Bandi Sanjay : సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు పోవాలని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కి అంబేద్కర్ పంచ తీర్థాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా అని ప్రశ్నించారు. ముందు వాటిని సందర్శించు రాహుల్ గాంధీ అని ఆయన అన్నారు. Harish Rao : సమగ్ర శిక్ష ఉద్యోగులను…
Harish Rao : రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామిని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీస్ స్టేషన్ తరలించి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు. ‘సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి గారూ… టెంట్లు…
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిల వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్లో డిసెంబర్ 22 రాత్రి 11.20కి సింధు, సాయిలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. మంగళవారం పీవీ సింధు, వెంకట దత్త సాయిల రిసెప్షన్ ఘనంగా జరిగింది. రాజకీయ,…
DK Aruna : సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజను బీజేపీ ఎంపీ డీకే. అరుణ పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల నుంచి తెలుసుకుని, బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటన దురదృష్టకరమని, ఒకరి మరణం, మరొకరి తీవ్ర గాయపడడం బాధకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని, సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి…
Allu Arjun Live Updates: పుష్ప -2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు సోమవారం నోటీసులు ఇచ్చారు.
TG Cabinet: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 30వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ విధి విధానాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.