Telangana Thalli Statue: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ (సోమవారం) సాయంత్రం 6 గంటలకు సచివాలయ ఆవరణలో విగ్రహ ఆవిష్కరణ జరగనుంది.
Telangana Assembly Sessions: ఇవాల్టి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. సభకు ముందు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగనుంది.
Kadiyam Srihari : వరంగల్ జిల్లా మడికొండ సత్యసాయి గార్డెన్ లో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజాపాలన విజయోత్సవ సభకు అధ్యక్షత వహించారు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్యలు హజరయ్యారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. 15సంవత్సరాలుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం వెనుకబదిందని దానిని దృష్టిలో పెట్టుకొని ఈసారి…
బీజేపీ కొట్లాడితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సనాతన ధర్మం గురించి, రైతుల గురించి, మహిళల గురించి రేవంత్ రెడ్డి పోరాటం చేశారా.. ఓటుకు నోటు కేసు అయింది, దానికే ఆయన జైలుకు పోయారని విమర్శించారు.
తెలంగాణలో నిజమైన మార్పు రావాలంటే నిజమైన ప్రజా ప్రభుత్వం బీజేపీతోనే సాధ్యమని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 12 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదని.. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమ శంఖారావం పూరించామన్నారు.
CM Revanth Reddy: నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
CM Revanth Reddy : టూరిజం పాలసీ పైన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లలో తెలంగాణ కు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదని, దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను అధ్యయనం చేయాలన్నారు. దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుంది.. దానికి అనుగుణంగా టూరిజాన్నీ అభివృద్ధి చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ హైదరాబాద్…
Prajapalana Celebrations : ఆరు నూరైంది.. మార్పు మొదలైంది. ప్రజలకు ఇచ్చిన మాటను ప్రజా ప్రభుత్వం నూటికి నూరు పాళ్లు నిలబెట్టుకుంది. తొలి ఏడాది లోనే సుస్థిర ప్రజాస్వామిక పాలనతో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టింది. అధికారం చేపట్టినప్పటి తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో తెలంగాణ సమ్మిళిత అభివృద్ధికి నిరంతరం సమీక్షలు… సమావేశాలు నిర్వహించారు. కేవలం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలకే పరిమితం కాకుండా దాదాపు 160 వినూత్న కార్యక్రమాలను…
Telangana Thalli Statue : డిసెంబర్ 9న తెలంగాణ సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. మొదట ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ చేతుల మీదుగా నిర్వహించాలని భావించినప్పటికీ, ఆమె అనారోగ్య కారణంగా రాలేకపోతున్నారని సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని…
Shabbir Ali : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజక వర్గ అబివృద్ధికి 27 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో 54000 వేల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. గ్రూప్ పరీక్షలు పేపర్ లీక్ లేకుండా యధావిధిగా నడిపించినామన్నారు షబ్బీఆర్ అలీ. కేటీఆర్, హరీష్ లు…