TPCC mahesh Kumar Goud : పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి నేతృత్వంలో పర్యటన కొనసాగుతోంది. విక్టోరియా రాష్ట్రం మెల్‌బోర్న్ నగరంలో ప్రభుత్వ అధికారుల ప్రతినిధి బృందంతో సమావేశమైంది రాష్ట్ర బృందం. క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఆ రాష్ట్ర అధికారులతో క్రీడలపై రాష్ట్ర బృందం చర్చించింది. క్రీడలు, మౌళిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రతినిధుల బృందం. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న రాష్ట్ర బృందంలో కరాటే రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు క్రీడలు జీతేందర్ రెడ్డి, స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనారెడ్డి, స్పోర్ట్స్ ఎండీ సోనీ బాల, హాకీ ఫెడరేషన్ రాష్ట్ర ఛైర్మన్ మహ్మద్ ఫహీమ్ ఖురేషి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. క్రీడలకు పెద్ద పీఠేస్తున్న ఆస్ట్రేలియా దేశంలో పర్యటిస్తోంది రాష్ట్ర ప్రతినిధుల బృందం.
తెలంగాణ రాష్ట్రంలోనూ క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ఈ పర్యటన సాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో యువతను క్రీడల వైపు ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఫోర్త్ సిటీలో 700 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం.. క్రీడలు, మౌళిక వసతులపై ఆస్త్రేలియాలో అధ్యయనం చేస్తోంది. అధిక మెడల్స్ దక్కించుకుంటున్న, క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది ఆస్ట్రేలియా దేశం. క్రీడాకారులకు ఆర్థిక సహకారంతో పాటు అత్యాధునిక సాంకేతికతో శిక్షణ ఇస్తోంది ఆస్ట్రేలియా.
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ని రక్షించిన ఆటో డ్రైవర్ “భజన్ సింగ్ రాణా”.. ఘటన గురించి ఏమన్నారంటే..