హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సమీపంలోని 400 ఎకరాల భూములపై హెచ్‌సీయూ, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఆ భూముల్లో ఎన్నో వన్యప్రాణులు జీవిస్తున్నాయి. అక్కడి భూమిలోని చెట్ల నరికివేతను ఆపాలని విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అలాగే మరోవైపు జంతువులు, పర్యవరణానికి ప్రమాదం తేవద్దంటూ పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు చేస్తున్నారు.
తాజాగా ఈ వివాదంపై సినీనటి రేణుదేశాయ్ స్పందిస్తూ ‘ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా చేస్తున్న ఓ విన్నపం. నాకు రెండు రోజుల క్రితం HCU భూముల వ్యవహారం గురించి తెలిసింది. అందుకు సంబంధించి కొన్ని విషయాలు కనుకున్నాను. రేవంత్ రెడ్డి గారు మీకు ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఇప్పుడు 44సంవత్సరాలు రేపో మాపో చనిపోతాను. కానీ నా పిల్లలు అలాగే మన అందరి పిల్లలకు ఆక్సిజన్ అలాగే త్రాగునీరు కావాలి. ఆవును మాకు అభివృద్ధి కూడా కావలి, మాకు ఐటి పార్క్స్, భారీ భవనాలు, వరల్డ్ క్లాస్ సదుపాయాలు కావాలి. కానీ ఈ 400 ఎకరాల ప్రకృతిని, ఫారెస్ట్ ను ధ్వసం చేయకుండా ఆపడానికి మీకు ఏదైనా అవకాశం ఉంటె వెంటనే ఆపేయండి. మీరు పరిపాలిస్తున్నఈ రాష్ట్ర సిటిజన్ గా అడుగుతున్న ఎదో ఒకటి చేయండి. మన దగ్గర ఎన్నో ఇతర భూములు ల్యాండ్స్ ఉన్నాయి. మీరందరు నాకంటే ఏంతో సీనియార్స్. మీకు నాకంటే ఏంతో అనుభవం ఉంది. ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో నా స్వార్థం లేదు. ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. గతంలో జరిగిన అబివృద్ధి వలనే ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాం. కానీ ఆ 400 ఎకరాలు దయచేసి వదిలేయండి. ఒక తల్లిగా అభ్యర్థిస్తున్నాను సదరు అధికారులు ఈ విషయంలో మరోసారి ఆలోచించండి. ఈ నిర్ణయాన్నివెనక్కి తీసుకుంటే మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అని విన్నవిస్తూ వీడియో రిలీజ్ చేసారు రేణుదేశాయ్.