జన సమితి కోదండ రామ్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదా? అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వేలంపై ఆయన మాట్లాడారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని… ఈ భూములను కాపాడుతామన్నారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులని గుర్తు చేశారు. ఈ భూములను రాబర్ట్ వాద్రా కోసమే అమ్ముతున్నావా? అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ భర్త కోసమే భూముల అమ్ముతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని విమర్శించారు. అవి సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాదని కోర్టుకు మీరు అఫిడవిట్ ఇచ్చింది వాస్తవం కాదా? అని అడిగారు. ఇద్దరు కలసి నాటకం ఆడుతున్నారని.. ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రం లో అరాచక పాలన నడుస్తుందని మండిపడ్డారు.
READ MORE: Chandigarh: రోడ్డుపై భార్య రీల్స్.. ఉద్యోగం పోగొట్టుకున్న కానిస్టేబుల్
“భూములను తెగ నమ్ముకుంటామని, రియల్ ఎస్టేట్ దందా చేస్తామని అంటున్నారు. ప్రజా పాలనను గాలికి వదిలేసిశారు. పోలీసుల నిర్బంధం కొనసాగుతుంది. ఎన్ని రోజులు అడ్డుకుంటారు. మేము హెచ్‌సీయూకి వెళ్తాం… విద్యార్థులకు అండగా ఉంటాం. భూములను అమ్ముతమనుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదు. మేము అన్ని యూనివర్సిటీ లని సందర్శస్తాం. భూములను కొనేందుకు యే వ్యాపార వేత్త ముందుకు రావొద్దు. తెలంగాణ ఉద్యమం లో 369 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగ్రెస్ తమ పాపాలను కడుక్కోవడానికి సెంట్రల్ యూనివర్శిటీ ఇచ్చారు. కాంగ్రెస్ అంటేనే మాట తప్పడం. ఉగాది రోజు న ప్రజా స్వామ్య పద్ధతిలో ఉద్యమం చేసిన విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేశారు. టీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం భూములను అమ్మింది….ఇప్పుడు మేము ఎందుకు అమ్మొదని కాంగ్రెస్ అనుకుంటుంది. రేవంత్ రెడ్డి కొకపేట భూములను అమ్మొద్దని అప్పట్లో ఉద్యమం చేశారు… సీబీఐకి ఫిర్యాదు చేశారు. విద్యార్థుల మీద లాఠీ ఛార్జ్ చేసినందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఈ భూమి యే గుంట నక్క కోసం ఇవ్వాలని అనుకుంటున్నారో రేవంత్ రెడ్డి చెప్పాలి.” అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.