Nitin Gadkari: హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇరువురు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో సీఎం చర్చలు చేపట్టారు. ఇప్పటికే టెండర్లను ఆహ్వానించిన RRR ఉత్తర భాగానికి వీలయినంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలుపాలని కేంద్ర మంత్రిని కోరారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి…
Harish Rao : ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా స్టూడెంట్ల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. డిగ్రీ స్టూడెంట్లకు ఇంకా ఫీజు రీయంబర్స్ మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్లు దోచిపెట్టారని.. కానీ స్టూడెంట్లకు మాత్రం ఫీజు రీయంబర్స్ మెంట్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. డిగ్రీ స్టూడెంట్లకు రూ.800 కోట్ల ఫీజు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలకు పకడ్బందీగా భద్రత ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. డీజీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ భద్రత ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీప మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఇటీవల పోలీసు అధికారులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్…
కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటి ఇంటికి అధికారులు వెళ్లి సర్వే చేశారన్నారు. కుల గణనపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. రేవంత్ సక్సెస్ అయ్యాడు కాబట్టి డైవర్ట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేయకండన్నారు.
Beerla Ilaiah : తెలంగాణలో రాజకీయ విమర్శలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ కవితపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. కార్మిక దినోత్సవం సందర్భంగా కవిత చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. కవిత ఇప్పటికైనా తెలంగాణ పట్ల సోయి చూపించడం గమనార్హమని చెప్పారు. సామాజిక తెలంగాణ ఇంకా రాలేదని ఇప్పుడు కవితకు అర్థమవుతోందంటే, గత 10 ఏళ్లలో తండ్రి కేసీఆర్ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు ఆమె గుర్తించుకుంటున్నట్లు తెలుస్తోందని ఐలయ్య…
HYDRA Police Station : హైదరాబాద్ నగరంలో భారీ స్పందన పొందిన హైడ్రా (HYDRAA) ఇప్పుడు ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు సన్నద్ధమవుతోంది. అక్రమ నిర్మాణాల కూల్చివేత, చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న ఈ ప్రత్యేక విభాగానికి ఇటీవల ప్రభుత్వం మరిన్ని అధికారాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించినట్లుగా, త్వరలో ప్రత్యేక హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా, మే 8వ తేదీన ముఖ్యమంత్రి…
CM Revanth Reddy : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతుంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జనగణన అంశాలపై ఈ భేటీలో చర్చలు జరుగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా హాజరయ్యేలా పార్టీ…
MP Laxman : కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కుల గణనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఘాటు స్పందన వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్, “రేవంత్ డీఎన్ఏలో అసలు కాంగ్రెస్ పార్టీ విలువలు లేవు” అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ కుల గణనకు ఎప్పటి నుంచో వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లు ఓబీసీపై మొసలి కన్నీరు కారిస్తుంటే,…
CM Revanth Reddy : తెలంగాణలో కుల గణనపై ప్రభుత్వ ప్రకటన రాహుల్ గాంధీ నాయకత్వంలోని జోడో యాత్రలో చెప్పిన విషయాలను ప్రస్తావిస్తూ, శాసన మండలి విపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ, కుల గణన దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన విధానం గురించి ముఖ్యంగా వివరించారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు వెళ్లిన జోడో యాత్రలో కుల గణనపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. “కుల గణన చేయడానికి అధికారంలోకి వస్తేనే…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం, అనుభవజ్ఞులైన విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కీలక పదవులు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. శ్రీనివాసరాజు ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందినవారు. గతంలో టీటీడీ జేఈవోగా విశిష్ట సేవలు అందించారు. ఇటీవల పదవీ విరమణ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఎంసీఆర్…