CM Revanth Reddy: రాష్ట్రంలో ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో పంటలకు భారీ నష్టం సంభవించిన విషయం తెలిసిందే. తాజాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. రాష్ట్రంలోని 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించిన సుమారు 5,528 ఎకరాల పంటలు వర్షాల కారణంగా నష్టపోయాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రూ.51.528 కోట్ల నిధులను మంజూరు చేసింది.
MCMVs: రక్షణ మంత్రిత్వ కీలక నిర్ణయం.. రూ.44వేల కోట్లతో యుద్ధ 12 నౌకల తయారీ..!
ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసి, త్వరలోనే నష్టపోయిన రైతుల ఖాతాల్లో జమ చేయడం కోసం చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. వివిధ పంటల నష్టాన్ని పరిశీలిస్తే, రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, ప్రత్తి 4,753 ఎకరాలు, ఇతర పంటలు 477 ఎకరాలలో వర్షాల కారణంగా నష్టం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Kamal : కమల్ “తగ్ లైఫ్” బ్యాన్.. కన్నడ సంఘాల ఫైర్.. అసలు ఏంటీ గొడవ?