Raghunandan Rao: యుద్ధం చేసేటోనికి తెలుస్తుంది.. సీఎంపై బీజేపీ ఎంపీ ఫైర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghunandan Rao: పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK) అంశంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రంగా స్పందించారు. యుద్ధం చేసే ధైర్యం, దమ్ము ఉంటేనే మాట్లాడాలని హితవు పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. అలాగే ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. యుద్ధం అనేది మాటలతో మాట్లాడేది కాదు.. అది చేసేటోనికి తెలుస్తుంది. రేవంత్ రెడ్డిది నెత్తి కాదు, కత్తి కాదు.. అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దేశం ఏం అనుకుంటుందో మోడీకి తెలుసు. మోడీ నాయకత్వం ఎలా ఉంటుందో భారత ప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు.
Read Also: MLA Vakiti Srihari: మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం.. ఇన్నోవా వాహనాన్ని ఢీకొన్న ఐ20 కార్
Also Read
- CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
- CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను మోడీ నేతృత్వంలో భారత్‌కు కలిపే ధైర్యం బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. ఇది రాజకీయ దురుద్దేశంతో మాట్లాడే విషయం కాదు.. మోడీ ప్రభుత్వం పీఓకేను భారత్‌లో కలపడం కచ్చితంగా చేస్తుంది. పాకిస్తాన్ త్వరలో రెండు ముక్కలు అవుతుంది. బలూచిస్తాన్ ఏర్పాటవుతుందని ఆయన అన్నారు. ఇక రాఫెల్‌పై అసత్య ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నాయకుల అలవాటుగా మారింది. ఇప్పటివరకు ఒక్క రాఫెల్ కూడా కూలలేదు. అవాస్తవాలు చెబితే చట్టపరమైన చర్యలు తప్పవు. కేసులు పెట్టి బొక్కలేస్తాం అని రఘునందన్ హెచ్చరించారు.
Read Also: Manoj : ఆయన కొడుకొచ్చాడని చెప్పు.. ‘భైరవం’ వేళ మనోజ్ పోస్ట్..
భారత్ సైన్యం వెనుక మేము ఉన్నామని, వారికి మద్దతుగా నిలబడతామని చెప్పేందుకే తిరంగ ర్యాలీలు నిర్వహించినట్లు ఆయన అన్నారు. రేవంత్, రాహుల్ లకు నిజంగా ధైర్యం ఉంటే ఒక బెటాలియన్‌కు నాయకత్వం వహించి వెళ్లాలని చెప్పండి. అలా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అందుకు సైన్యంలో లేటరల్ ఎంట్రీ ఉంది. కానీ, నాయకులు దానికి అర్హతను చూపించాలి. రాజకీయ లబ్ధికోసం మాట్లాడడం మంచిది కాదని అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బటన్ నొక్కడం నా విధానం కాదు.. కామన్ మ్యాన్‌లా ప్రజల్లో ఉంటా.. ప్రజలే మాకు ప్రతిపక్షం..
-
Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?