CM Revanth Reddy : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జపాన్ కిటాక్యూషు నగర ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర భవిష్యత్తు కోసం కొత్త అంతర్జాతీయ భాగస్వామ్యాలు ఎలా నిర్మించబడుతున్నాయో వివరించారు. “తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు, రాష్ట్ర పురోగతిని వేగవంతం చేయడం కోసం, కొత్త ప్రపంచ భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడమే మా లక్ష్యం,” అని సీఎం పేర్కొన్నారు.
Khaleja : ‘ఖలేజా’ చూపించిన మహేశ్.. మూడు రోజుల్లోనే భారీ కలెక్షన్లు..
అప్రిల్‌లో జపాన్‌ను సందర్శించిన సమయంలో, కిటాక్యూషు నగర అభివృద్ధిని దగ్గర నుంచి పరిశీలించినట్లు ఆయన తెలిపారు. “ఎకో-టౌన్ మోడల్ నాకు గట్టిగా ప్రేరణనిచ్చింది. ఆ ప్రేరణతో హైదరాబాద్‌లో కూడా అలాంటి మోడల్‌ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నాం,” అన్నారు. ఈ దిశగా ఇప్పటికే అనేక జపనీస్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలపై తెలంగాణ ప్రభుత్వం సంతకాలు చేసింది. ఈ ఒప్పందాలు సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాల లక్ష్యం, పట్టణ ఆవిష్కరణలలో భాగస్వామ్యానికి పునాది కానున్నాయి. సీఎఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కిటాక్యూషు-తెలంగాణ సహకార ఒప్పందంపై ఈ రోజు సంతకం చేయడం ఎంతో ఆనందంగా ఉంది,” అని తెలిపారు. రాష్ట్రం ప్రస్తుతం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై కేంద్రీకృత దృష్టితో పనిచేస్తోందని చెప్పారు.
KCR: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరుకావొద్దని కేసీఆర్ నిర్ణయం..
అలాగే, తెలంగాణ యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. “మా విద్యార్థులు జపనీస్ భాష నేర్చుకోవాలనే ఆసక్తి చూపుతున్నారు. జపాన్‌లో అవకాశాలను అన్వేషించాలనుకుంటున్నారు. మీ సహకారంతో వారికి జపనీస్ నేర్పించే అవకాశాలపై పని చేస్తాం,” అన్నారు. ఇక హైదరాబాద్, కిటాక్యూషు మధ్య ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం వెల్లడించారు. “మీ నగరం చూపిన నాయకత్వం అభినందనీయం. కిటాక్యూషు అభివృద్ధి నమూనా, తెలంగాణ రైజింగ్‌కు సరిపోయేలా ఉంది. మన స్నేహం సుదీర్ఘంగా, అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా,” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.