Revanth Reddy: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ప్రభుత్వ పాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని అన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వామ్యులని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం శ్రామికుల అభ్యున్నతికి దోహదపడుతుందని ఆయన అన్నారు. కార్మికుల శ్రేయస్సు, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ‘మే’…
Revanth Reddy: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో పదవ తరగతి పరీక్ష ఫలితాలను విడుదల చేసిన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవకారుడు అంటే తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదని, విప్లవాత్మక మార్పు తెచ్చే ఎవరైనా విప్లవకారుడని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ పై బసవేశ్వరుడు ప్రభావం ఎక్కువని సీఎం అన్నారు. ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దేలా ప్రతిపక్ష వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని…
TG SSC : తెలంగాణలో 2024లోని టెన్త్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు వచ్చిన 9.85 లక్షల మంది విద్యార్థుల్లో 92.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఈ శాతం 1.47 పాయింట్ల మెరుగుదలని సూచిస్తోంది, ఇది విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్రం చేసిన ప్రగతి చాటుతుంది. ఈ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర విద్యామంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 5,07,107 మంది…
TG SSC : తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్న్యూస్. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న TS 10వ తరగతి ఫలితాలు విడుదలకు తేదీ ఖరారైంది. విద్యాశాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 30న బుధవారం మధ్యాహ్నం 1 గంటకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల…
EX Minister Jagadish Reddy: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై ప్రజల్లో చర్చ జరుగుతోంది అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇక, సభకు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ చెప్పలేదని సీఎం బాధపడుతున్నారు ఎద్దేవా చేశారు.
పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. అనంతరం సీఎం మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. పలువురు నాయకులను ఉద్దేశించి హెచ్చరించినట్లు తెలుస్తోంది. తనని నమ్ముకున్న వాళ్లని తాను ఎప్పుడూ మర్చిపోనని సీఎం రేవంత్ అన్నారు. తనని నమ్ముకున్న వాళ్లలతో అద్దంకి దయాకర్ ఉన్నారని.. దయాకర్కు ఎమ్మెల్సీ వచ్చిందన్నారు. ఓపికతో ఉంటే నాకూ బాధ్యత ఉంటుంది..
CM Revanth Reddy : బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ భారీ సభ నిర్వహించారు. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చ జరిగినట్లు చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు…
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.. ఇది సాధ్యమా అని అడిగారు. మన సభకు ప్రజలు రాకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు.. బీఆర్ఎస్ సభల్ని ఆపుతారా.. ఈ ప్రభంజనాన్ని ఎలా ఆపుతారు అని అడిగారు..
Rega Kanta Rao : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వరంగల్లో భారీగా రజోత్సవాలు, గులాబీ పండుగ నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు తెలిపారు. తెలంగాణ సాధనకు 60 ఏళ్లుగా కృషి చేసిన కేసీఆర్ నాయకత్వంలో మహాసభ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మహాసభను అడ్డుకోవడానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కాంతారావు ఆరోపించారు. సభకు ప్రజలను వెళ్లకుండా చేయడానికి స్కూల్ బస్సులు, ప్రైవేట్…
MLC Kavitha : తెలంగాణ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. “ఎన్నికల సమయంలోనే కనిపించే గాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చారు. ఆయనను స్వాగతించాల్సిందే… ఎందుకంటే మళ్లీ కనిపించేది ఎన్నికలపూటే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కవిత తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసపూరితంగా నిలిచాయని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను ఆకర్షించిన కాంగ్రెస్ పార్టీ…