HYDRAA Police Station: హైదరాబాద్ నగరంలోని బుద్ధ భవన్ సెకండ్ బ్లాక్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన సీఎంకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ IPS స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కమిషనర్ రంగనాథ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌లోని వసతులను పరిశీలించారు. ఇక హైడ్రా…
Bhatti Vikramarka : ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, మెడికల్ కళాశాల ఏర్పాటుతో పేదలకు ఉచిత వైద్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ఇకపై హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన…
HYDRA : భారతదేశంలో అనేక మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, భూకబ్జాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చెరువుల అట్టడుగు లోతు కల్పించేవి వంటి సమస్యలపై దృష్టి సారిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ క్రమంలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అమలులోకి తీసుకురావడమనే నిర్ణయం తీసుకుంది. నేటి నుంచే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నగరంలోని బుద్ధభవన్ పక్కనే నిర్మితమైన ఈ హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్…
CM Revanth Reddy : ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తూ ర్యాలీలో పాల్గొనాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మే 8 గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత భారీగా పాల్గొనాలని ఆయన కోరారు. ఇక బుధవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన సివిల్ మాక్‌డ్రిల్…
CM Revanth Reddy: ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగుతున్న తరుణంలో, హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా ఇతర కీలక విభాగాల ఉన్నతాధికారులు హాజరవుతారు. తాజా పరిస్థితులను…
ముఖ్యమంత్రి ముక్కు సూటి మనిషి అని.. గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మీడియాతో మంత్రి చీట్‌చాట్ నిర్వహించారు. బీజేపీ వాళ్లు దిగి పోండి అంటున్నారు.. బీజేపీ కేంద్రం లో పాలన చేతకాకపోతే దిగమను.పెహల్గం వైఫల్యంకి దిగి పో అనాలా..? బీజేపీ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా..? మోడీ విదేశాలకు పోతే.. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయా..?
మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తిప్పికొట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పై అనవసర వ్యాఖ్యలతో కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. కేసీఆర్ అప్పు.. తెలంగాణ భవిష్యత్తుకు ముప్పుగా దాపురించిందన్నారు. కేసీఆర్ నిర్వాహకం వల్ల నెలకు 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుందన్నారు. సత్తా ఉన్న…
Bandi Sanjay : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మెదక్ జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగిన సభలో ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. “కాంగ్రెస్ ఖేల్ ఖతం, దుకాణ్ బంద్” అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. సీఎం స్వయంగా చేసిన వ్యాఖ్యలే వారి వైఫల్యానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్,…
KTR : తెలంగాణ రాజకీయ వేడి మరోసారి పెరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వ్యక్తిగత దూషణలు, విమర్శలు వచ్చినా సహించామని, కానీ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పాల్గొన్నా వాస్తవాన్ని గుర్తుచేస్తూ, అలాంటి నేతలపై ముఖ్యమంత్రి చేసిన…