Kishan Reddy: ఆ ముగ్గురూ సైనికుల సాహసాన్ని అవమానిస్తున్నారు.. కిషన్‌రెడ్డి ఫైర్..!
- రాహుల్ తన విధానాలు మార్చుకోవాలి
- దేశంలో కాంగ్రెస్ వరుసగా మూడు సార్లు ఓడిపోయింది
- దేశ ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టారు
- కాంగ్రెస్ మూడు రాష్ట్రాలకే పరిమితం అయింది
- రాహుల్ అనుమానిస్తుంటే, దేశప్రజలు సాధిస్తూనే ఉంటారు
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న జైహింద్ ర్యాలీ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలందరూ కూడా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని కోరారని.. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలని దేశ ప్రజలు ఆకాంక్షించారని గుర్తు చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సిందూర్ ప్రారంభించారన్నారు. పాక్ ఉగ్రవాద స్థావరాలను, పాక్ కీలకమైన సైనిక కేంద్రాలను ధ్వంసం చేసిన విషయాన్ని మనం చూశామని.. ఆపరేషన్ సిందూర్ ఎవరికి తెలియకుండా జరిగిన సంఘటన కాదన్నారు. క్షణ, క్షణం మీడియా లైవ్‌లో ప్రపంచం మొత్తం చూసిందని.. ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన 23 నిమిషాల్లో 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన మన సైన్యం మనకు కళ్లకు కట్టినట్లు చూపించిందని వెల్లడించారు.
READ MORE: Andhra Pradesh: తనిఖీల ఎఫెక్ట్.. దిగొస్తున్న సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు..!
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
భారత్ చెప్పిన అంశాలే కాదు.. పాక్ ప్రధానితో సహా అనేక వీడియోల ద్వారా స్పష్టం ప్రపంచానికి తెలిపిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మన మిసైల్ దాడులను సీసీ పుటేజీల ద్వారా పాక్ మన సైన్యం బయటపెట్టిందన్నారు. “మేమే దాడి చేయాలనుకున్నాం. కానీ 9వ తేదీన రాత్రికి రాత్రే భారత్ తిరిగి మిసైల్స్‌తో పాక్ మీద దాడి చేసింది. ఆకారణంగా మా సైనికులు తిరిగి దాడి చేయలేక పోయాం.” అని పాక్ ప్రధాని ఒప్పుకున్న విషయాన్ని కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. పాక్ ప్రధాని స్వయంగా ప్రకటించిన వీడియోలను ప్రపంచమంతా చూసిందన్నారు. కానీ దురదృష్టమేంటంటే.. నిన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ వితండ వాదాన్ని లేవదీశారని.. రాహుల్ గాంధీ, వాళ్ల బావ రాబర్ట్ వాద్రా, సీఎం రేవంత్‌రెడ్డి ఈ ముగ్గురు సైన్యాన్ని తగ్గువ చేసే విధంగా మాట్లాడారన్నారు. రాహుల్ గాంధీ అడగాల్సింది ఎన్ని మిసైల్స్ కూలియాయని కాదు.. ఎంత మంది ఉగ్రవాదులు చినిపోయారో అడిగితే ప్రజలు సంతోషించే వాళ్లమన్నారు. మన ఆధునిక టెక్నాలజీ, మిసైల్స్ గురించి అడిగి ఉండేది. మన సైనికులు భారత్‌లోనే ఉండి పాక్ ఉగ్రస్థావరాలపై ఎలా దాడి చేశారో అడిగితే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
READ MORE: KCR: రాజకీయ కక్షతోనే కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు.. కేసీఆర్ సంచనల ఆరోపణలు..!
“ఈ ముగ్గురు దేశ సైనికులను అవమానించేలా.. వాళ్ళు చేసిన పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడుతున్నారు. రాహుల్ అడగాల్సింది.. ఎన్ని రఫెల్ విమానాలు కూలాయి అని కాదు.. ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారు అని అడిగితే బాగుండు. ఎన్ని రఫెల్ విమానాలు కూలాయి లెక్క చెప్పండి అని.. రాహుల్ రేవంత్ లు అడుగుతున్నారు. రాహుల్ కు 55 ఏళ్లు వచ్చినా, ఇంకా మెచ్యూరిటీ రాలేదు. బడే మియా మాటలకు వత్తాసుగా, చోటే మియా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. సైనికుల సాహసాన్ని అవమానిస్తున్నారు. ఇప్పటికే ఎంపీల బృందాలు.. ప్రపంచంలోని అన్ని దేశాలు తిరుగుతున్నారు.. పాక్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియచేస్తున్నారు. రాహుల్, రేవంత్ ల మాటలను దేశ ప్రజలు చూస్తున్నారు. ఢిల్లీలో రేవంత్ మూడు రోజులు ఉన్నా.. రాహుల్ దర్శనం దక్కలేదు.. అవమానానికి గురై వెనక్కి పోయాడు.” అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
READ MORE: Amit Shah: యుద్ధ బాధితులకు అండగా ఉంటాం.. కాశ్మీర్ టూర్‌లో అమిత్ షా భరోసా
భారత సైనికులను తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గం. దేశ భద్రతకు భంగం కలిగించేలా మాట్లాడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. “దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలి. రేవంత్ మన పాకిస్థాన్ అని మాట్లాడారు. బీజేపీ జెండా తిరంగ యాత్రలు జరగడం లేదు. భారత సైన్యం సామర్థ్యాన్ని దేశ ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. రాహుల్ ప్రధాని అయి ఉంటే.. పీఓకేను స్వాధీనం చేసుకుంటారు అని రేవంత్ కామెంట్స్ చేశారు. ఈ జన్మలో రాహుల్ కు ప్రధాని అయ్యే అవకాశం రాదు. పాక్ ఎటువంటి దాడులు చేసినా, మోడీ సర్కార్ ఊరుకోలేదని.. ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ హయంలో వందల ఉగ్రవాద కార్యక్రమాలు జరిగాయి. దేశంలో ఎన్నో వరుస పేలుళ్లు జరిగాయి. రాహుల్ దుర్బుద్ధి తో మాట్లాడుతున్నారు. మనదేశం పాక్, చైనాలతో యుద్ధం వచ్చినా.. ఉద్రిక్త పరిస్థితులు వచ్చినా.. ప్రజలందరూ రాజకీయాలు.. కులాలు.. మతాలు పక్కన పెట్టీ ఒక్కటిగా నిలబడ్డారు.” అని కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలపై పవన్ కల్యాణ్ ప్రత్యేక సర్వే..!
రాహుల్ తన విధానాలు మార్చుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. దేశంలో కాంగ్రెస్ వరుసగా మూడు సార్లు ఓడిపోయిందని.. దేశ ప్రజలు కర్రు కాల్చి వాతలు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ మూడు రాష్ట్రాలకే పరిమితం అయిందన్నారు. రాహుల్ అనుమానిస్తుంటే, దేశప్రజలు సాధిస్తూనే ఉంటారని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం చేస్తున్న ఆపరేషన్లను రాహుల్ అర్థం చేసుకోవాలన్నారు. భారత స్వాతంత్ర్య చరిత్రలో ఇంత దిగజారిన నాయకులను చూడలేదని మండిపడ్డారు. భారత్ లో ఉన్న పాక్ నెట్ వర్క్ ను మొత్తం డిస్ట్రాయ్ చేసిందన్నారు. ఈ నాయకులు విదేశీ వేదికలను పరిగణలోకి తీసుకుని భారత్ ను విమర్శిస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!