Mallu Ravi : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రేపటితో (జూన్ 2) 11వ తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ఈ సందర్భంగా మల్లు రవి, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయ కార్యక్రమాలను వివరించారు. మల్లు రవి మాట్లాడుతూ, “తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను గత ప్రభుత్వాలు విస్మరించాయి. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ప్రజలను మోసం చేశాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాజిక న్యాయం లక్ష్యంగా పాలన కొనసాగుతోంది,” అని పేర్కొన్నారు.
Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!
ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన చర్యలలో భాగంగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సుమారు 25 లక్షల మంది రైతులకు రూ. 22,000 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్లు మల్లు రవి చెప్పారు. ఇది రాష్ట్ర రైతాంగానికి పెద్ద ఊరటగా నిలిచిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 200 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. కుల, మతాలతో సంబంధం లేకుండా ప్రతి పేద విద్యార్థి గుణాత్మక విద్య పొందేలా వీటిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. అలాగే, 7 లక్షల మంది విద్యార్థులకు 40 శాతం మెస్ ఛార్జీలు, 200 శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు.
ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ యువతలో 5 లక్షల మందికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రూ. 6 వేల కోట్లతో పథకాలు రూపొందించినట్లు తెలిపారు. ఇదే విధంగా, “గిరి సౌర జల వికాస్” పథకానికి రూ. 11,600 కోట్ల నిధులు కేటాయించారని వెల్లడించారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైస్ మిల్లులు, పెట్రోలు బంకులు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3 కోట్ల 5 లక్షల మంది పేదలకు సన్న బియ్యం సరఫరా చేయడం జరుగుతోంది. “తెలంగాణను ఏర్పాటుచేసిన సోనియా గాంధీ ఆశయాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది,” అని మల్లు రవి తెలిపారు. పలు సామాజిక హితం కలిగించే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.
Fraud : ఉద్యోగాల పేరుతో మోసం.. హైకోర్టు జడ్జిగా నటించిన మహిళ అరెస్టు