CM Revanth Reddy : హైదరాబాద్ లోని హయత్ నగర్లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూగ బాలుడు ప్రేమ్ చంద్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఉదయం పత్రికల్లో ఈ వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే, బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,…
ముఖ్యమంత్రి పర్యటనకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ముస్తాబయింది. నేడు సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్నాబాద్ కు రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ కోసం హుస్నాబాద్ పట్టణంలోని ఏనే వద్ద మైదానంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సభా ప్రాంగణంలోనే హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 262.68 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు పలువురు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ప్రజా…
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రగతికి, పెట్టుబడుల ఆకర్షణకు అత్యంత కీలకంగా భావిస్తున్న తెలంగాణ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ (డిసెంబర్ 8, 9) కు ప్రముఖ నేతలను ఆహ్వానించేందుకు సీఎం, డిప్యూటీ సీఎంలు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి…
CM Revanth Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (డిసెంబర్ 2) రాత్రి ఢిల్లీకి పయనం కానున్నారు. రేపు (డిసెంబర్ 3, బుధవారం) ఉదయం నుంచి ఆయన దేశ రాజధానిలో పలు ముఖ్యమైన సమావేశాల షెడ్యూల్లో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా.. హైదరాబాద్లో జరగనున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్-2026కు ప్రముఖులను ఆహ్వానించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే…
TPCC Meeting: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) విస్తృత స్థాయి సమావేశం నేడు (మంగళవారం) గాంధీభవన్లో జరగనుంది. పార్టీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, కార్యవర్గ సభ్యులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన జిల్లా, పట్టణ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులతో పాటు, ఇదివరకు ఆ పదవుల్లో కొనసాగిన…
వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు(ఎం), అమరచింత మున్సిపాలిటీల పరిధిలో రూ. 151.92 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని.. ఏ మాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. మేడారం అభివృద్ధి పనులపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాతి పనులతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి చూసే ప్రదేశాలు…
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే “తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్”పై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డాక్యుమెంట్ తయారీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్పై లోతైన చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత…
Lionel Messi : ఫుట్బాల్ ప్రపంచాన్ని తన ప్రతిభతో మంత్రముగ్ధులను చేసిన ఆర్జెంటీనా లెజెండ్ లియోనెల్ మెస్సీ ఈ డిసెంబర్లో హైదరాబాద్ రానున్నాడు. The G.O.A.T India Tour – 2025లో భాగంగా భారత పర్యటనకు సిద్ధమైన మెస్సీ, ఈ కార్యక్రమం సందర్భంగా హైదరాబాద్ను సందర్శించనున్నట్టు అధికారికంగా వెల్లడైంది. ఫుట్బాల్ అభిమానులకు ఇది అద్భుతమైన అవకాశంగా మారనుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ ప్రమోషన్లో భాగంగా, మెస్సీని రాష్ట్రానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్గా…