Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఓటర్లను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 30 వేల మెజార్టీ తో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. BRS ఉప ఎన్నికలు వచ్చాయి.. మా MLA చనిపోయారు… ఆయన సతీమణికి ఓటేయండి అని అడుగుతున్నారని, పట్నం వచ్చిన పేదలకు ఉద్యోగ..…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్, PJR టెంపుల్ వద్ద రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పేదల మేలు కోరే కాంగ్రెస్ హస్తం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని జూబ్లిహిల్స్ ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..…
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(GCC)ని ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం వివరించింది. GCC ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు.
CM Revanth Reddy : నాగర్‌కర్నూల్ జిల్లా మన్నేవారిపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. SLBCని గత ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. పదేళ్లు.. పది కిలో మీటర్ల టన్నెల్ కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో టన్నెల్ పూర్తియ్యేదని, SLBC పూర్తి ఐతే కాంగ్రెస్ కి పేరు వస్తుంది అని పక్కన పెట్టారని ఆయన మండిపడ్డారు. పేరే కాదు.. కమిషన్…
Telangana: సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి పనులకు ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు జీఓ విడుదలైంది. క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిధులతో ఇండోర్ స్టేడియంలో సింథటిక్ కోర్టులు, బాస్కెట్‌బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్‌బాల్ కోర్టులు ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయనున్నారు. Allu Shirish : తన లవ్ స్టోరీ ఎలా మొదలైందో చెప్పిన శిరీష్ అలాగే వాకింగ్ ట్రాక్, లైటింగ్, అథ్లెటిక్స్…
KTR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తోందని, ఈ అన్యాయాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మౌనం ఎందుకు వహిస్తున్నారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో బుల్డోజర్లను సవాల్ చేసిన రాహుల్ గాంధీ, తెలంగాణలో పేదలపై జరుగుతున్న అన్యాయాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు?” అని నిలదీశారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై…
రాష్ట్రంలోని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బకాయిలు విడుదల చేయకపోవడంతో నవంబర్ 3 నుంచి అన్ని వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక బంద్‌లోకి వెళ్తున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ఛైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి 1,200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. “మిగతా మొత్తానికి ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని, ఒక రోడ్‌మ్యాప్…
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహం దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందం ఆయనను కలిసింది. ఈ భేటీలో ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్ మరియు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కెనడాతో భాగస్వామ్యం గురించి విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి కెనడా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని తెలియజేస్తూ,…
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. శుక్రవారం షేక్‌పేట్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. నందీనగర్ నివాసం నుంచి ప్రారంభమైన ఈ ప్రచారం సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగింది. వేలాదిగా చేరిన కార్యకర్తలు, స్థానిక ప్రజలు “కేటీఆర్ జయహో”, “కారు గుర్తుకే ఓటు” అంటూ నినాదాలు చేశారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా నిర్వహించిన ఈ ప్రచారంలో మాట్లాడిన కేటీఆర్,…