మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో పాలనాపరమైన సంస్కరణలు , స్థానిక సంస్థల బలోపేతం లక్ష్యంగా ఈ కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికలు , జిల్లాల పునర్విభజన వంటి అంశాలపై స్పష్టతనిచ్చింది.
రాష్ట్రంలో గడువు ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. వస్తున్న ఫిబ్రవరి మాసంలోనే ఈ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ద్వారా పాలనను మరింత చేరువ చేయాలని, పెండింగ్‌లో ఉన్న వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల ఆమోదంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
పాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేపట్టాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగిన జిల్లాల విభజనలో కొన్ని అశాస్త్రీయతలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం, వాటిని సవరించి ప్రజలకు అందుబాటులో ఉండేలా జిల్లాల సరిహద్దులను మార్చాలని నిర్ణయించింది. ఈ పునర్విభజన ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
జిల్లాల పునర్విభజన , ఇతర పాలనాపరమైన అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిషన్‌కు ఒక రిటైర్డ్ జడ్జి అధ్యక్షత వహిస్తారు. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల వినతులు , భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే జిల్లాల తుది రూపకల్పన జరుగుతుంది.
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ద్వారా స్థానిక నాయకత్వాన్ని బలపరచడం, అలాగే జిల్లాల పునర్విభజన ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత వేగంగా అందించడం ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. జిల్లాల మార్పులు , ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.
Prabhas Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ మార్చి 5నే రావడానికి అసలు కారణం ఇదేనా!