మేడారంలో సమ్మక్క-సారలమ్మ ఆలయ పునర్నిర్మాణం , అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో కనిపించే ఫ్రేమ్డ్ ప్లేట్లు లేదా ప్లాస్టిక్ బోర్డులలా కాకుండా, ఇక్కడ ఆదివాసీల జీవన విధానం , వారి సంస్కృతి ఉట్టిపడేలా అత్యంత ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ శిలాఫలకాలను ప్రారంభించారు. ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల శైలిని ప్రతిబింబించేలా, రాయిని సహజంగా ఉంచి దానిపైనే వివరాలను చెక్కడం ఈ శిలాఫలకాల ప్రధాన ప్రత్యేకత.
India: ఈ రెండు ముస్లిం దేశాల్లో భారత్‌కు అసలైన ‘స్నేహితుడు’ ఎవరు?
ఈ శిలాఫలకాల చుట్టూ గిరిజన మహిళల రూపరేఖలు కలిగిన శిల్పాలను, అలాగే వారి సంప్రదాయంలో కీలకమైన డప్పు వాయిద్య కళాకారుల ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఆదివాసీల జీవన విధానంలో కొమ్ముబూరలు, డప్పు వాయిద్యాలు , గిరిజన నృత్యాలకు ఉన్న ప్రాముఖ్యతను ఈ శిల్పాలు చాటిచెబుతున్నాయి. కేవలం పనుల వివరాలకే పరిమితం కాకుండా, గుడి చరిత్రను , గిరిజన సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించేలా వీటిని తీర్చిదిద్దారు. అటవీ శాఖ అధికారులు, ఐఏఎస్ అధికారులు , దేవాదాయ శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శుల నుండి కింది స్థాయి అధికారుల వరకు, ఈ అభివృద్ధి పనుల్లో భాగస్వాములైన అందరి పేర్లు చిరకాలం నిలిచిపోయేలా గ్రానైట్ రాళ్లపై చెక్కించారు. మేడారానికి వచ్చే భక్తులకు గిరిజన సంస్కృతిని పరిచయం చేస్తూ, ఈ శిలాఫలకాలు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Maoists Encounter: బీజాపూర్ లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి