ఇన్ని గంటలపాటు మీటింగ్ కోసం సమయం కేటాయిస్తున్నారు అంటేనే… కాంగ్రెస్ పార్టీ పై మైనార్టీ సోదరులకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఒక ముక్క ని కర్ణాటక లో, ఒక ముక్క ని మహారాష్ట్ర లో, మరో ముక్క ని ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మైనార్టీ సోదరులు మరిచిపోవద్దు. ముస్లిం వ్యక్తి ని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా…
హుజురాబాద్ ఎన్నికలకు సిద్దమవుతోంది తెలంగాణ కాంగ్రెస్. పార్టీ అభ్యర్ధి ఎంపిక కసరత్తు మొదలుపెట్టింది. పార్టీ గెలుస్తుందని ఎవరు అనుకోవడం లేదు.. కానీ, పోటీలో కూడా లేకుండా పోతే ఎలా అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. వీలైనంత త్వరగా అభ్యర్ధి ఎంపిక చేయాలనే ఆలోచనలో పార్టీ ఉంది. బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఎవరికి ఉంటుందనే లెక్కలు వేస్తోంది. దీంట్లో భాగం… మాజీ మంత్రి కొండా సురేఖ పేరు పరిశీలిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే అందుకు కొండా సురేఖ…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఉప్పు నిప్పులా ఉన్న ఆ ఇద్దరు నాయకుల మధ్య దోస్తీ సాధ్యమా? ఆ ఇద్దరినీ కలిపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? కుస్తీకే ప్రాధాన్యం ఇచ్చి.. ఎవరి ఎత్తుగడలు వారు వేస్తారా? అందరి ఫోకస్ ఆ ఇద్దరిపైనే ఎందుకు ఉంది? రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు! తెలంగాణ కాంగ్రెస్ దళిత గిరిజన దండోరా పేరుతో జనంలోకి వెళ్తోంది. ఇంద్రవెల్లి నుండి ప్రారంభమైన దండోరా.. ఈ నెల 18న ఇబ్రహీంపట్నంలో మరో సభకు…
ఇంద్రవెల్లిలో దళిత ఆత్మగౌరవ దండోరా సభ పేరుతు భారీ బహిరంగ సభ నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది… ఇక, దానికి కొనసాగింపుగా… తర్వాత సభ ఈ నెల 18వ తేదీన ఇబ్రహీంపట్నం వేదికగా నిర్వహిస్తామంటూ… ఇంద్రవెల్లి సభ వేదికగా ప్రకటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… అయితే, ఇప్పుడా సభను రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ… ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభను రద్దు చేసిన టి.పీసీసీ.. మహేశ్వరం…
ఇంద్రవెల్లి సభ ను రేవంత్ తన నోటి దురుసుతనం ప్రదర్శించేందుకు పెట్టుకున్నారు. అది దళిత, గిరిజనుల కోసం పెట్టిన సభ కాదు అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రేవంత్ దొడ్డి దారిన పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. రేవంత్ భాషను చూస్తే ఆయన ముఖం మీద ఉమ్మి వేయాలని కోట్లాది ప్రజలకు ఉంది. కుక్క కాటుకు చెప్పు అనే రీతిలో రేవంత్ కు తగిన శాస్తి చేయాలి. సీఎం కేసీఆర్ పై రేవంత్ వాడిన భాష ను…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి… ఇంద్రవెల్లి సభ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. రేవంత్ లాగా పగతోని.. ప్రతికారంతో రాజకీయం చేస్తే ఆయన రోడ్డుపై తిరగగలడా? అని ప్రశ్నించారు.. రేవంత్ దిగజారిన భాష చూసి తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఊగి పోతున్నారన్న సైదిరెడ్డి.. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాను బలి దేవత అన్నారు.. ఇప్పుడు మహా దేవత అంటున్నారు అని ఎద్దేవా చేశారు.. సీఎం కేసీఆర్…
తెలంగాణలో రాజకీయాలు దళిత, గిరిజనుల చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఇంద్రవెల్లి ఘటన సాక్ష్యంగా దళిత, గిరిజన దండోర సభ నిర్వహించింది. దీనికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌కూ అన్యాయం జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌దేనని హామీ ఇచ్చారు. తెలంగాణకు ఎస్సీ నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. ఎస్సీని ఉప ముఖ్యమంత్రిని చేసి రెణ్నెళ్లకే తొలగించారన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీలకు చోటు…
ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించిన దళిత దండోరా కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఇంద్రవెల్లి గడ్డ మీద నిలబడితే రక్తం మరుగుతోందని.. బానిస సంకేళ్లను తెంచిన పోరాట స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తోందన్న ఆయన.. ఉద్యమాలకు ఊపిరి ఊదిన కొమురం భీం ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ గాలి పీలిస్తే గొంతు ఎత్తి పోరాటం చేయాలనిపిస్తుంది.. ఈ మట్టికి త్యాగాల చరిత్ర ఉంది.. తుపాకీ…