ఔను.. వాళ్లిద్దరూ కలిశారు..! అదీ రహస్యంగా..!! తెలంగాణ కాంగ్రెస్లో ఈ సీక్రెట్ భేటీపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొదట్లో ఉప్పు-నిప్పుగా ఉన్న నాయకులు.. ఒక్కసారిగా హస్తినలో రహస్యంగా సమావేశమై ఏం మాట్లాడుకున్నారు? ఆ బ్యాక్డ్రాప్లో వినిపిస్తోన్న గుసగుసలేంటి? ఎవరు వారు? ఢిల్లీలో రేవంత్, ఉత్తమ్ గంటపాటు రహస్య భేటీ? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ఎవరు ఎప్పుడు కలిసి ఉంటారో.. ఎప్పుడు కయ్యాలు పెట్టుకుంటారో తెలియదు. ఇద్దరు కీలక నాయకుల మధ్య తాజా జరిగిన పంచాయితీ ఆ కోవలోకే…
గిరిజనులు అమాయకులే కావచ్చు.. కానీ ఆలోచన లేని వారు కాదు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజనుల కష్టాలను ప్రభుత్వం గుర్తించడం లేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో దళితుల ఓట్లు కొనుగోలు చేసేందుకు కేసీఆర్ ఇంటికి పది లక్షలు ప్రకటించాడు అని తెలిపారు. మరి రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తడో ఎందుకు చెప్పట్లేదు. ఈ 7 సంవత్సరాలలో ప్రభుత్వం 15 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే.. అందులో గిరిజనులకు ఖర్చు పెట్టింది ఎంత.…
హుజురాబాద్ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ లో ఉన్న వారిని కొంతమందిని కోవర్టులుగా మార్చుకున్నరు కేసీఆర్. మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. పార్టీ కి వ్యతిరేకంగా ఎవరు పని చేసిన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే.. అది నాతో సహా అని తెలిపారు. ఇక ఆగస్టు 9న ఇంద్రవెళ్లిలో దళిత, గిరిజన దండోరా జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆగస్టు 11 నుంచి 21 వరకు పది రోజుల పాటు…
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార లక్ష్యంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్ పార్టీ… ఈ మధ్యే ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పీసీసీ చీఫ్ పదవితో పాటు.. వివిధ కమిటీలను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం.. ఇక, కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ వచ్చిందనే టాక్ నడుస్తోంది.. మరోవైపు.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లకు కొత్త బాధ్యతలు అప్పగించారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి… వారికి పార్లమెంట్ స్థానాల వారీగా పని విభజన చేశారు. ఈ…
కేసీఆర్ సర్కార్ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క… ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మాట్లాడిన ఆమె.. నిజాం కాలం తరహాలో ఆదివాసీలపై ఫారెస్ట్ అధికారుల దాడులు సాగుతున్నాయని మండిపడ్డారు.. నాటి నుంచీ నేటి వరకు భూమికోసం పోరాటం తప్పడం లేదన్న ఆమె.. తిరుగుబాటుకు తిలకం దిద్దిన గడ్డ నుంచి చేసే ఇంద్రవెల్లి దండోరా పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు… కొమురం భీం పోరాటం చేసిన పోరుగడ్డ ఇది అని ఆమె…
తెలంగాణ కాంగ్రెస్లో విబేధాలు మరోసారి రచ్చకెక్కాయి. ఇటీవల టీపీసీ చీఫ్రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి సభకు పిలుపునివ్వడంపై పార్టీలోని కొందరు నేతలు అగ్గిమీద గుగ్గులం అవుతున్నారు. తమకు చెప్పకుండా ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై గాంధీ భవన్లో జరిగిన పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో వాడీ వేడీ చర్చ జరిగింది. రేవంత్రెడ్డి ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్రెడ్డి. జిల్లా నాయకులకు సమాచారం ఇవ్వకుండా.. ఇంద్రవెల్లి…
కాంగ్రెస్ ఇంద్రవెల్లి దండోరా ను అడ్డుకుంటాం అని ఆదిలాబాద్ ఆదివాసి హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. ఇంద్రవెల్లి దండోర ప్రకటన రోజు చేసిన రేవంత్ వ్యాఖ్యల పై ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆదివాసి ,లంబాడాలు ఎక్కడ కలసి పోరాటం చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆదివాసిల చరిత్ర తెలుసుకోని రేవంత్ రెడ్డి మాట్లాడాలి అని తుడుందెబ్బ నాయకులు తెలిపారు. ఆగస్టు 9 ఆదివాసిల దినోత్సవం.. అది మా పండుగ రోజు.. ఆరోజు ఇంద్రవెల్లి లో రాజకీయ…
గిరిజనులను అనాధలుగా చేశారు సీఎం కేసీఆర్. భూముల పై హక్కులు లేకుండా చేస్తుంది ప్రభుత్వం. సీలింగ్ యాక్ట్ తెచ్చి గడిల దగ్గర బందీ అయిన భూములను పేదలకు పంచింది కాంగ్రెస్ అని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గిరిజన బిడ్డలు ఐఏఎస్..ఐపీఎస్ లు అయ్యే అవకాశం కాంగ్రెస్ కల్పించింది. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్ లే గిరిజనుల కు అండ. రెండు పర్యాయాలు తెరాస కి అధికారం కట్టబెట్టి నా… గిరిజనుల హక్కులు లేకుండా పోయాయి. పోడు…
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైనది గుర్తుచేశారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి… కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడులో నివాళులర్పించారు రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్లు గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి వినోద్, సురేష్ షెట్కార్, తదితరులు.. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో జైపాల్ రెడ్డి పాత్ర కీలకమైందని.. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం…